హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSC Results: ఆ ఫలితాలను విడుదల చేసిన SSC.. Results, కట్ ఆఫ్ మార్కులను చెక్ చేసుకోండిలా..

SSC Results: ఆ ఫలితాలను విడుదల చేసిన SSC.. Results, కట్ ఆఫ్ మార్కులను చెక్ చేసుకోండిలా..

SSC Results: ఆ ఫలితాలను విడుదల చేసిన SSC.. Results, కట్ ఆఫ్ మార్కులను చెక్ చేసుకోండిలా..

SSC Results: ఆ ఫలితాలను విడుదల చేసిన SSC.. Results, కట్ ఆఫ్ మార్కులను చెక్ చేసుకోండిలా..

SSC Results: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, గ్రేడ్ డీ ఫలితాలను కమిషన్ విడుదల చేసింది. ఎంత కట్ ఆఫ్ అయింది.. కేటగిరీల వారీగా చివరి అభ్యర్థి మార్కుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) నిర్వహించిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, గ్రేడ్ డీ(Grade D) ఫలితాలను కమిషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కరోనా కాలం కారణంగా పలు దఫాలుగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C మరియు గ్రేడ్ D 2020 పరీక్షలు ఎట్టకేలకు 2022 జూన్ 20 మరియు 21 తేదీల్లో నిర్వహించారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి స్కిల్ టెస్ట్‌కు హాజరయ్యేందుకు మొత్తం 3 వేల 608 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయగా, గ్రేడ్ డికి మొత్తం 13 వేల 445 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

SSC స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C మరియు గ్రేడ్ D రిక్రూట్‌మెంట్ కోసం స్కిల్ టెస్ట్ ఫలితాలను అలాగే అభ్యర్థుల కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులను కమిషన్ విడుదల చేసింది. SSC స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అవకాశం ఉంటుంది.

Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఫరీక్ష పలితాలను ఇలా చెక్ చేసుకోండి..

- అభ్యర్థులు SSC యొక్క అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inకి వెళ్లండి.

-వెబ్‌సైట్ హోమ్‌పేజీలో, SSC స్టెనోగ్రాఫర్ గ్రూప్ C & గ్రూప్ D ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

-మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను సమర్పించండి.

-ఆ తర్వాత స్కిల్ టెస్ట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితా మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

-మీ పేరు ఉందో లేదో ఇక్కడ తెలుసుకోవచ్చు.

AP-TS Postal GDS Results: పోస్టల్ జీడీఎస్ ఫలితాలు.. ఐదో లిస్ట్ ను ప్రకటించిన అధికారులు..

కటాఫ్ జాబితా ఇలా..

స్టేనో గ్రాఫర్ గ్రేడ్ C.. 

1. ఎస్సీ కట్ ఆఫ్ 139.31554 మార్కులు. వీటి నుంచి 35 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

2. ST కటాఫ్ 119.86940 మార్కులు. ఇందులో 9 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

3. OBC కట్ ఆఫ్ 148.42862. 91 అభ్యర్థులు ఎంపికయ్యారు.

4. EWS కటాఫ్ 149.25265. ఇందులో 32 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

5. UR కటాఫ్ 157.03860. 54 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

6. OH కట్ ఆఫ్ 117.81410. 2 అభ్యర్థులు ఎంపికయ్యారు.

7. VH కట్ ఆఫ్ 73.97151. 4 అభ్యర్థులు ఎంపికయ్యారు.

స్టెనో గ్రాఫర్ గ్రేడ్ డీ ఇలా..

1. ఎస్సీ కట్ ఆఫ్ 128.42784 మార్కులు. వీటి నుంచి 354 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

2. ST కటాఫ్ 101.42221 మార్కులు. ఇందులో 133 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

3. OBC కట్ ఆఫ్ 138.55078. 649 అభ్యర్థులు ఎంపికయ్యారు.

4. EWS కటాఫ్ 127.00785. ఇందులో 280 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

5. UR కటాఫ్ 148.17852. 479మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

6. OH కట్ ఆఫ్ 91.17234. 48 అభ్యర్థులు ఎంపికయ్యారు.

7. VH కట్ ఆఫ్ 61.77808. 24 అభ్యర్థులు ఎంపికయ్యారు.

మొత్తం గ్రేడ్ సీ కి 227 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. గ్రేడ్ డీ కి 1982 మంది ఎంపికయ్యారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Exam results, JOBS, Ssc, Staff Selection Commission

ఉత్తమ కథలు