SSC Jobs: 10,000 పైగా మల్టీటాస్కింగ్ ఉద్యోగాలు పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

SSC MTS notification 2019 | సుమారు 10,000 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) పోస్టుల్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుందని అంచనా.

news18-telugu
Updated: May 27, 2019, 3:35 PM IST
SSC Jobs: 10,000 పైగా మల్టీటాస్కింగ్ ఉద్యోగాలు పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
SSC Jobs: 10,000 పైగా మల్టీటాస్కింగ్ ఉద్యోగాలు పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
news18-telugu
Updated: May 27, 2019, 3:35 PM IST
స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 29 చివరి తేదీ. కొంతకాలం క్రితం జారీ చేసిన నోటిఫికేషన్‌కు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అంచనా. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మే 29 వరకే అవకాశం ఉందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటీసు జారీ చేసింది. దరఖాస్తుకు ఇంకా వారం రోజులే గడువు ఉండటంతో సర్వర్లపై లోడ్ పెరుగుతుందని, అందుకే ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేయాలని సూచిస్తోంది. సుమారు 10,000 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) పోస్టుల్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుందని అంచనా.

SSC MTS notification 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం: 2019 ఏప్రిల్ 22

దరఖాస్తు ముగింపు: 2019 మే 29 సాయంత్రం 5 గంటల వరకు
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్‌కు చివరి తేదీ: 2019 మే 31 సాయంత్రం 5 గంటల వరకు
ఆఫ్‌లైన్ చలానాకు చివరి తేదీ: 2019 మే 29 సాయంత్రం 5 గంటల వరకు


చలానాతో పేమెంట్‌కు చివరి తేదీ: 2019 జూన్ 1
Loading...
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష మొదటి దశ: 02.08.2019 నుంచి 06.09.2019 మధ్య
రెండో దశ పరీక్ష: 17.11.2019

SSC MTS notification 2019: ముఖ్యమైన వివరాలు


విద్యార్హతలు: మెట్రిక్యూలేషన్ లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి.
వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు.
టైర్-1 పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ విధానంలో, టైర్-2 పరీక్ష డిస్క్రిప్టీవ్ విధానంలో ఉంటుంది.
ఎంపికైన వారికి రూ.20,200 వరకు వేతనం లభిస్తుంది.

SSC MTS notification 2019: దరఖాస్తు చేసుకోండి ఇలా...


ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఓపెన్ చేయాలి.
హోమ్‌ పేజీలో ‘log-in’ సెక్షన్‌లో ‘register now’ పైన క్లిక్ చేయాలి.
మీ వివరాలతో రిజిస్టర్ చేసుకొని ఇమేజెస్ అప్‌లోడ్ చేయాలి.
చివరగా పేమెంట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

గతేడాది 10,000 మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ని నియమించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈసారి కూడా దాదాపు అన్ని పోస్టుల్నే భర్తీ చేస్తుందని అంచనా. ఖాళీలకు సంబంధించి అప్‌డేట్స్ కోసం ssc.nic.in వెబ్‌సైట్‌లో ‘students corner’ సెక్షన్‌లో ‘tentative vacancies’ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:

Budget Smartphones: బడ్జెట్ ఫోన్ కావాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే...

SSC MTS Jobs: 10,000 పోస్టులు... ఇప్పటికే 25 లక్షల దరఖాస్తులు... మే 29 చివరి తేదీ

Railway Jobs: కోచ్ ఫ్యాక్టరీలో 992 అప్రెంటీస్ పోస్టులు... టెన్త్ పాసైనవారికీ అవకాశం
First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...