హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Constable Jobs: ఇంటర్ పూర్తి చేశారా.. ఈ కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..

Constable Jobs: ఇంటర్ పూర్తి చేశారా.. ఈ కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Constable Jobs: ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దిల్లీ పోలీస్‌ విభాగంలో ఈ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ విద్యార్హతతో పాటు.. హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు అధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 1411 పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజర్వేషన్ల వారీగా.. ఓపెన్‌ కేటగిరీ కింద 604, బ్యాక్ వర్ట్ క్లాసెస్ (ఓబీసీ) కింద 353, ఈడబ్ల్యుఎస్‌ కింద 142, ఎస్సీ 262, ఎస్టీ కింద 50 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

Telangana Schools | Holidays: విద్యార్థులకు అలర్ట్.. మరో మూడు రోజులు సెలవులు పొడిగింపు..


10+2 (సీనియర్‌ సెకండరీ)/ తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. దీంతో పాటు.. హెవీ మోటర్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వాహనాల నిర్వహణ, మోటార్ మెకానిక్ పై తగిన పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.  జూలై 1, 2022 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ల వారీగా గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రిజర్వేషన్ అభ్యర్థులకు ఎస్సీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆన్ లైన్ లో దరఖాస్తుకు చివరి తేదీ జూలై 29, 2022గా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://ssc.nic.in/ను సందర్శించి తెలుసుకోవచ్చు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్ష పేపర్ ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. దీనిలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులను తగ్గిస్తారు. జనరల్‌ అవేర్‌నెస్‌ 20, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 20, న్యూమరికల్‌ ఎబిలిటీ 10, రోడ్‌సెన్స్‌, వెహికల్‌ మెయింటెనెన్స్‌, ట్రాఫిక్‌ రూల్స్‌/సిగ్నల్స్‌, వాహన, పర్యావరణ కాలుష్యం మొదలైన అంశాల్లో 50 ప్రశ్నలు ఉంటాయి.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష అక్టోబరు, 2022లో ఉంటుంది. తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కాకినాడ,కర్నూలు, నెల్లూరు, రాజమండ్రిలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలో అర్హత సాధించినవారికి పరుగుతోపాటు లాంగ్‌జంప్‌, హైప్‌జంప్‌లు నిర్వహిస్తారు. వీరికి వేతనం రూ.21,700గా నిర్ణయించారు. దీంతో పాటు.. అలవెన్సులతో కలుపుకొని రూ.40వేల వరకు వస్తాయి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Staff Selection Commission, Women constables

ఉత్తమ కథలు