నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని పలు కేటగిరీల్లో భారీగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని పలు కేటగిరీల్లో భారీగా ఖాళీలను (Central Government Jobs) భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. మొత్తం 2065 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 13వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించనున్నారు.
విద్యార్హతల వివరాలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టులను అనుసరించి టెన్త్ ఇంటర్, గ్రాడ్యుయేషన్ తదితర విద్యార్హతలను కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25, జనరల్ అవేర్ నెస్ నుంచి 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి మరో 25 ప్రశ్నలు ఉంటాయి.
-అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.