హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSC Updates: ఎగ్జామినేషన్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేసిన SSC.. CHSL టైర్ 1, CGL టైర్ 2 ఎప్పుడంటే?

SSC Updates: ఎగ్జామినేషన్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేసిన SSC.. CHSL టైర్ 1, CGL టైర్ 2 ఎప్పుడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SSC Updates: ఎస్సెస్సీ తన అధికారిక వెబ్సైట్ ssc.nic.inలో అన్ని వివరాలను ఉంచుతుంది. ఫిబ్రవరి 6న కొత్త అప్‌డేట్‌ ఇచ్చింది. అందులో CGL, CHSL పరీక్షలకు సంబంధించిన కొత్త వివరాలు ఉంచింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఏటా ముందే షెడ్యూల్ ఇచ్చి, దాని ప్రకారం నియమకాలు జరిపే బోర్డుల్లో ఎస్సెస్సీ(SSC) ఒకటి. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఎస్సెస్సీ ప్రతి సంవత్సరం నియమకాలు చేపడుతుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు వివిధ అర్హతలకు సంబంధించి.. ఎస్సెస్సీ జీడీ కానిస్టేబుల్, మల్లీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్‌(CHSL), కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్‌ (CGL), స్టెనోగ్రాఫర్లు తదితర పరీక్షలు నిర్వహిస్తుంది. ఏటా కొన్ని లక్షల మంది ఈ పరీక్షలు రాస్తుంటారు. అందుకు సన్నద్ధమయ్యే వారికి ఉపయోగకరంగా ఉండేలా ఆ ఏడాది నిర్వహించే షెడ్యూల్‌ను ముందుగానే విడుదల చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆయా నోటిఫికేషన్లు ఇచ్చే తేదీలు, దరఖాస్తులు, పరీక్షల నిర్వహణ వంటివాటిలో కొన్ని మార్పులు ఉండవచ్చు. 2023-24 ఏడాదికి సంబంధించి వివిధ రకాల పరీక్షల షెడ్యూల్ 2022 డిసెంబర్ 30న విడుదల చేసింది.

* లేటెస్ట్ అప్‌డేట్‌ ఇదే

ఎస్సెస్సీ తన అధికారిక వెబ్సైట్ ssc.nic.inలో అన్ని వివరాలను ఉంచుతుంది. ఫిబ్రవరి 6న కొత్త అప్‌డేట్‌ ఇచ్చింది. అందులో CGL, CHSL పరీక్షలకు సంబంధించిన కొత్త వివరాలు ఉంచింది. దాని ప్రకారం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్‌-2022 టైర్-2 పరీక్షను 02.03.2023 నుంచి 07.03.2023 వరకు నిర్వహించనున్నారు. అలాగే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్‌-2022 టైర్-1 పరీక్షను 09.03.2023 నుంచి 21.03.2023 వరకు జరగనున్నాయి.

* కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామ్‌

వివిధ కేంద్ర కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ, లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర గ్రూప్-సి పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 4,500 పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు. టైర్ 1 పరీక్ష మార్చిలో జరగనుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి 200 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి.

ఇది కూడా చదవండి :  Agniveer Recruitment: అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కీలక మార్పులు.. అవేంటో చూడండి

* కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్

మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి దీన్ని నిర్వహిస్తారు. ఇందులో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు ఉంటాయి. గత ఏడాది డిసెంబర్ లో టైర్ 1 పరీక్ష నిర్వహించారు. టైర్ 2 మార్చిలో జరగనుంది. ఇందులో కొన్ని పరీక్షలు అందరికీ ఉండగా, కొన్ని డిపార్ట్మెంట్‌లకి సంబంధించి ప్రత్యేకంగా ఉంటాయి. పూర్తి వివరాలు సంబంధిత సైట్ లో చూడవచ్చు.

* వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాలు

ఎస్సెస్సీ సంబంధించిన తాజా వివరాలు తెలుసుకునేందుకు దాని అధికారిక వెబ్‌సైట్‌ ssc.nic.inని సంప్రదించవచ్చు. హోమ్‌పేజీలో ‘లేటెస్ట్ న్యూస్’ అనే చిన్న బాక్స్ ఉంటుంది. దీంట్లో వివిధ రకాల పరీక్షల వివరాలు, సిలబస్, తేదీల్లో మార్పులు, పరీక్షల ఫలితాలు, ఇంటర్వ్యూ ఫలితాలు వంటి వివరాలన్నీ ఏరోజు కారోజు ఉంచుతారు. ఇయర్ క్యాలెండర్ కూడా ఇందులో ఉంటుంది. ఈ క్యాలెండర్ మీకు నేరుగా కావాలంటే లాగిన్ ఐడీ కింద క్యాలెండర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కనిపించే లింక్ పై క్లిక్ చేస్తే పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.

First published:

Tags: Central Government Jobs, Chsl, JOBS, Ssc, Ssc cgl

ఉత్తమ కథలు