హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSC Recruitment 2023: టెన్త్ పాసయ్యారా? 11,409 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండిలా

SSC Recruitment 2023: టెన్త్ పాసయ్యారా? 11,409 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండిలా

SSC Recruitment 2023: టెన్త్ పాసయ్యారా? 11,409 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

SSC Recruitment 2023: టెన్త్ పాసయ్యారా? 11,409 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

SSC Recruitment 2023 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (Central Govt Jobs) కోరుకునేవారికి అలర్ట్. మొత్తం 11,409 పోస్టులకు అప్లై చేయడానికి మరో 4 రోజులు మాత్రమే గడువు ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,409 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు 10880 ఉండగా, హవల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. 2023 ఫిబ్రవరి 17న దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దరఖాస్తు చివరి తేదీని 2023 ఫిబ్రవరి 24 వరకు పొడిగించింది. దరఖాస్తు గడువుతో పాటు ఇతర ముఖ్యమైన తేదీలను కూడా పొడిగించింది. అభ్యర్థులకు అప్లై చేయడానికి మరో 4 రోజులు గడువు ఉంది. అభ్యర్థులు 2023 ఫిబ్రవరి 24 రాత్రి 11 గంటల లోగా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్ 2023 ఫిబ్రవరి 26 రాత్రి 11 గంటల లోగా చేయాలి. ఆఫ్‌లైన్ చలానా 2023 ఫిబ్రవరి 26 రాత్రి 11 గంటల లోగా జనరేట్ చేయాలి. 2023 ఫిబ్రవరి 27 బ్యాంకు వేళలు ముగిసేలోగా ఆఫ్‌లైన్ చలానా చెల్లించాలి. దరఖాస్తు ఫామ్‌ను కరెక్షన్ చేయడానికి 2023 మార్చి 2 నుంచి మార్చి 3 రాత్రి 11 గంటల వరకు అవకాశం ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2023 ఏప్రిల్‌లో ఉంటుంది.

IPPB Recruitment 2023: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు ... ఖాళీల వివరాలివే

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అభ్యర్థులు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం లాంటి 13 ప్రాంతీయ భాషల్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

SSC Recruitment 2023: రిజిస్ట్రేషన్ చేయండి ఇలా

Step 1- అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో New User ? Register Now పైన క్లిక్ చేయాలి.

Step 3- పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి.

Step 4- ఆ తర్వాత డిక్లరేషన్ ఫిల్ చేయాలి.

Step 5- మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.

Step 6- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.

Railway Group D Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

SSC Recruitment 2023: దరఖాస్తు చేయండి ఇలా

Step 1- రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత దరఖాస్తు చేయడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి.

Step 2- లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి వివరాలు డిస్‌ప్లేలో కనిపిస్తాయి.

Step 3- ఆ వివరాలన్నీ సరిచూసుకోవాలి. ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు.

Step 4- ఆ తర్వాత కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్-CHSL నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలి.

Step 5- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 6- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

గతంలోనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా రెండో పద్ధతి ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.

First published:

Tags: Central Government Jobs, Central Govt Jobs, JOBS, Multi tasking staff, Staff Selection Commission

ఉత్తమ కథలు