హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదోతరగతి అర్హతతో 11,400 ఉద్యోగాలు..

SSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదోతరగతి అర్హతతో 11,400 ఉద్యోగాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SSC Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సంస్థల్లో కర్లికల్ పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఏటా రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంటుంది. తాజాగా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC & CBN) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సంస్థల్లో కర్లికల్ పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఏటా రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంటుంది. తాజాగా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC & CBN) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఫిబ్రవరి 17తో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య, అర్హత, ఇతర వివరాలు..

* ఖాళీల వివరాలు

మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్(MTS)- 10,880

హవల్దార్ (CBIC & CBN) -529

* అప్లికేషన్ ప్రాసెస్

ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఓపెన్ చేయాలి. వన్-టైమ్ రిజిస్ట్రేషన్ కోసం లాగిన్ సెక్షన్‌లో ‘రిజస్టర్ నౌ’ లింక్‌పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను ఫిల్ చేయండి.

ఆ తరువాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వండి. ‘లెటెస్ట్ నోటిఫికేషన్స్’ సెక్షన్‌లో ‘మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ అండ్ హవల్దార్ (CBIC & CBN) ఎగ్జామినేషన్, 2022’ కు సంబంధించి అందుబాటులో ఉన్న అప్లై లింక్‌ను క్లిక్ చేయండి.

తర్వాతి విండోలో మిగతా వివరాలను నింపండి. అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్ లోడ్ చేయండి. ఆ తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

చివరకు ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం ఈ డాక్యుమెంట్‌ను ప్రింటవుట్ తీసుకోండి.

* అప్లికేషన్ ఫీజు

అన్ రిజ్వర్డ్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. వీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

* అర్హత ప్రమాణాలు

అభ్యర్థులు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కటాఫ్ తేదీ ఫిబ్రవరి 17, 2023 కంటే ముందుగా పదికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. CBN (రెవెన్యూ శాఖ)లో MTS, హవల్దార్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జనవరి 1 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. CBIC (రెవెన్యూ శాఖ)లో హవల్దార్, కొన్ని MTS పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయసు జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇది కూడా చదవండి : ఉదయం మీటింగ్‌ అని పిలిచారు.. వచ్చాక 3 వేల మంది ఉద్యోగాలు పీకేశారు!

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఐదేళు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ (అన్ రిజర్వ్డ్) అభ్యర్థులకు పదేళ్లు, పీడబ్ల్యూ‌బీడీ(ఓబీసీ)-13 ఏళ్లు, పీడబ్ల్యూబీ‌డీ (ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులకు - 15 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.

* ఎంపిక ప్రక్రియ

SSC MTS & హవల్దార్ 2022 పరీక్ష 2023 ఏప్రిల్‌లో జరగనుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో ఉంటుంది. అయితే పరీక్ష తేదీలను సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

First published:

Tags: Central Government Jobs, JOBS, Latest jobs, Ssc

ఉత్తమ కథలు