Home /News /jobs /

SSC RECRUITMENT 2022 NEW OFFICIAL UPDATE IS COMMISSION TO FILL 70000 VACANCIES UMG GH

SSC Recruitment: ఎస్‌ఎస్‌సీ‌లో కొలువుల జాతర.. ఏకంగా 70 వేల ఉద్యోగాలు..!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాల జాతర.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాల జాతర.

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో 70,000 అదనపు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పరీక్షల (Exans)కు సంబంధించిన నోటిఫికేషన్ల (Notification)ను నిర్ణీత సమయంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఇంకా చదవండి ...
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో 70,000 అదనపు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పరీక్షల (Exams)కు సంబంధించిన నోటిఫికేషన్ల (Notifications)ను నిర్ణీత సమయంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ - ssc.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC జారీ చేసిన అధికారిక నోటీసులో ‘రిక్రూట్‌మెంట్ ప్రక్రియను కమిషన్ వేగవంతం చేయనుంది. ఇందులో భాగంగా సుమారు 70,000 అదనపు ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను చేపట్టనుంది. పరీక్షలకు సంబంధించిన నోటీసులను నిర్ణీత సమయంలో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాం. తదుపరి అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.’ అని సూచించింది. 2022 డిసెంబర్ నాటికి 42, 000 అపాయింట్‌మెంట్‌లు పూర్తవుతాయని ఎస్‌ఎస్‌సీ వెల్లడించింది. ఈ ఏడాదే భారీగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ
ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ద్వారా కీలక వివరాలు వెల్లడించింది. 67,768 ఖాళీలను తక్షణమే భర్తీ చేయడానికి SSC ప్రణాళికలను రూపొందించినట్లు పీఐబీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ లోపు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 42,000 అపాయింట్‌మెంట్‌లను పూర్తి చేస్తుందని కూడా పేర్కొంది. 15,247 పోస్టులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ జారీ ప్రక్రియను త్వరలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. శాఖల వారీగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు SSC పేర్కొంది.



18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు: ప్రధాని మోదీ
వచ్చే 18 నెలల్లో 10 లక్షల మంది సిబ్బందిని తమ ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ చేయనున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పట్టాలు తప్పిన నేపథ్యంలో, మిషన్ మోడ్‌లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖలలో మానవ వనరుల స్థితిగతులను సమీక్షించారు. రాబోయే 1.5 సంవత్సరాలలో 10 లక్షల మందిని మిషన్ మోడ్‌లో నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది’ అని అధికారికంగా ప్రకటించింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వివిధ ప్రభుత్వ సంస్థలు, విభాగాల్లో గ్రాడ్యుయేట్, హయ్యర్ సెకండరీ, మెట్రిక్ స్థాయి పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకమైన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటారు. 2022లో కమిషన్.. SSC CGL, SSC CHSL, SSC GD కానిస్టేబుల్ పరీక్షలు సహా కొన్ని ప్రధాన పరీక్షలను నిర్వహించింది. త్వరలో SSC MTS, SSC స్టెనోగ్రాఫర్, SSC కానిస్టేబుల్, SSC సబ్-ఇన్‌స్పెక్టర్, SSC జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్షలు జరగనున్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, JOBS, Ssc, Staff Selection Commission

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు