Home /News /jobs /

SSC RECRUITMENT 2022 2065 WEEKLY CHANCE TO APPLY FOR CENTRAL GOVERNMENT JOBS FIND OUT THESE THINGS EVK

SSC Recruitment 2022: 2,065 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుకు వారం రోజులే చాన్స్‌.. ఈ విషయాలు తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Staff Selection Commission Recruitment 2022 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X-2022 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ssc.nic.inల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 13లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...
    స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X-2022 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ssc.nic.inల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 13లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కంప్యూటర్ మోడ్‌లో ఆగస్టు 2022లో జరుగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2065 ఖాళీలను ఎస్‌ఎస్‌సీ భర్తీ చేయనుంది.  ఈ నేపథ్యంలో  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెస్, పరీక్ష విధానానికి సంబంధించి పలు అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

    Jobs in AP: క‌ర్నూలు జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ.32,670.. అర్హతలు ఇవే!

    అర్హతలు..

    సెలక్షన్ పోస్ట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థి దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (హై స్కూల్) పరీక్షను పూర్తి చేసి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

    ప‌రీక్షా విధానం..

































    స‌బ్జెక్ట్ప్ర‌శ్న‌లుమార్కులు
    క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్2550
    జనరల్ ఇంటెలిజెన్స్2550
    ఇంగ్లీష్‌2550
    జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్2550
    మొత్తం100200

    దరఖాస్తు విధానం

    స్టెప్-1: సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inను సందర్శించాలి.

    స్టెప్-2: హోమ్ పేజీలోని ఎస్‌ఎస్‌సీ క్యాండిడేట్స్ పోర్టల్‌లో అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి.



    Health Department Jobs: నిరుద్యోగుల‌కు మంత్రి గుడ్ న్యూస్‌.. 1,326 పోస్టుల‌తో ఆ శాఖ‌లో నోటిఫికేష‌న్‌

    స్టెప్-3: ఆ తరువాత ఫేజ్ X 2022 పరీక్ష కోసం లాగిన్ అయి దరఖాస్తు చేసుకోండి.

    స్టెప్-4: అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

    Layoff Season Continues: టెక్కీల‌కు షాక్‌.. ఒక్క నెల‌లో 15,000 మంది ఉద్యోగుల తొల‌గింపు


    స్టెప్-5: ఆపై దరఖాస్తు రుసుమును చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.

    స్టెప్-6: దరఖాస్తు ఫారమ్ కన్ఫర్‌మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.

    స్టెప్-7:  దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 13, 2022 వరకు అవకాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS, Staff Selection Commission

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు