SSC Recruitment 2021: ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారికి 3261 ఉద్యోగాలు... దరఖాస్తుకు ఇంకొన్ని గంటలే గడువు

SSC Recruitment 2021: ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారికి 3261 ఉద్యోగాలు... దరఖాస్తుకు ఇంకొన్ని గంటలే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

SSC Recruitment 2021 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దేశవ్యాప్తంగా 3261 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారికి అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని (Govt Jobs) భర్తీ చేసేందుకు ఫేజ్ 9 (SSC Phase 9 Notification) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 3261 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 25 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేయాలని, చివరి తేదీని పొడిగించబోమని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటీస్ విడుదల చేసింది. కాబట్టి అభ్యర్థులు 2021 అక్టోబర్ 25 లోగా దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు, ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    SSC Recruitment 2021: కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు ఇవే...





























    మొత్తం ఖాళీలు 3261
    జనరల్ 1366
    ఎస్‌సీ 477
    ఎస్‌టీ 249
    ఓబీసీ 788
    ఈడబ్ల్యూఎస్ 381

    ONGC Recruitment 2021: ఓఎన్‌జీసీలో 309 ఉద్యోగాలు... ఆ డిగ్రీ ఉంటే చాలు

    SSC Recruitment 2021: జోన్ల వారీగా ఖాళీల వివరాలు ఇవే...





































    మొత్తం ఖాళీలు 3261
    ఎస్‌ఎస్‌సీ ఈఆర్ రీజియన్ 800
    ఎస్‌ఎస్‌సీ కేకేఆర్ రీజియన్ 117
    ఎస్‌ఎస్‌సీ ఎంపీఆర్ రీజియన్ 137
    ఎస్‌ఎస్‌సీ ఎన్ఆర్ రీజియన్ 1159
    ఎస్‌ఎస్‌సీ ఎన్‌డబ్ల్యూఆర్ రీజియన్ 618
    ఎస్‌ఎస్‌సీ ఎస్ఆర్ రీజియన్ 159
    ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూఆర్ రీజియన్ 271

    APPSC Recruitment 2021: ఏపీపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... నేటి నుంచి దరఖాస్తులు

    SSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


    దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 24

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 25 రాత్రి 11.30 గంటలు

    ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 28 రాత్రి 11.30 గంటలు

    ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 28 రాత్రి 11.30 గంటలు

    ఆఫ్‌లైన్ చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2021 నవంబర్ 1

    కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- 2022 జనవరి లేదా ఫిబ్రవరి

    Railway Jobs: రైల్వేలో 2226 ఉద్యోగాలు... టెన్త్‌తో పాటు ఆ అర్హత ఉంటే చాలు

    SSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- 10+2, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయాలి.

    వయస్సు- 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

    దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

    వేతనం- రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.85,500 వేతనం లభిస్తుంది.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    SBI PO Notification 2021: ఎస్‌బీఐలో 2,056 ఉద్యోగాలు... డిగ్రీ చదువుతున్నవారికీ ఛాన్స్

    SSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి New User? Register Now పైన క్లిక్ చేయాలి.

    Step 3- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో ఫామ్ పూర్తి చేయాలి.

    Step 4- తర్వాతి స్టెప్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.

    Step 5- తర్వాతి స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

    Step 6- ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.

    Step 7- గతంలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసినవారు పైన చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ నెంబర్‌, పాస్‌వర్డ్‌తో నేరుగా లాగిన్ కావాలి.

    Step 8- అప్పటికే పూర్తి చేసిన వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు.

    Step 9- ఫేజ్ 9 (SSC Phase 9 Notification) లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.

    Step 10- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

    Step 11- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: