ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారికి అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని (Govt Jobs) భర్తీ చేసేందుకు ఫేజ్ 9 (SSC Phase 9 Notification) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 3261 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 25 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేయాలని, చివరి తేదీని పొడిగించబోమని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటీస్ విడుదల చేసింది. కాబట్టి అభ్యర్థులు 2021 అక్టోబర్ 25 లోగా దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు, ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 3261 |
జనరల్ | 1366 |
ఎస్‌సీ | 477 |
ఎస్‌టీ | 249 |
ఓబీసీ | 788 |
ఈడబ్ల్యూఎస్ | 381 |
ONGC Recruitment 2021: ఓఎన్‌జీసీలో 309 ఉద్యోగాలు... ఆ డిగ్రీ ఉంటే చాలు
మొత్తం ఖాళీలు | 3261 |
ఎస్‌ఎస్‌సీ ఈఆర్ రీజియన్ | 800 |
ఎస్‌ఎస్‌సీ కేకేఆర్ రీజియన్ | 117 |
ఎస్‌ఎస్‌సీ ఎంపీఆర్ రీజియన్ | 137 |
ఎస్‌ఎస్‌సీ ఎన్ఆర్ రీజియన్ | 1159 |
ఎస్‌ఎస్‌సీ ఎన్‌డబ్ల్యూఆర్ రీజియన్ | 618 |
ఎస్‌ఎస్‌సీ ఎస్ఆర్ రీజియన్ | 159 |
ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూఆర్ రీజియన్ | 271 |
APPSC Recruitment 2021: ఏపీపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... నేటి నుంచి దరఖాస్తులు
దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 25 రాత్రి 11.30 గంటలు
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 28 రాత్రి 11.30 గంటలు
ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 28 రాత్రి 11.30 గంటలు
ఆఫ్‌లైన్ చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2021 నవంబర్ 1
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- 2022 జనవరి లేదా ఫిబ్రవరి
Railway Jobs: రైల్వేలో 2226 ఉద్యోగాలు... టెన్త్‌తో పాటు ఆ అర్హత ఉంటే చాలు
విద్యార్హతలు- 10+2, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయాలి.
వయస్సు- 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
వేతనం- రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.85,500 వేతనం లభిస్తుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
SBI PO Notification 2021: ఎస్‌బీఐలో 2,056 ఉద్యోగాలు... డిగ్రీ చదువుతున్నవారికీ ఛాన్స్
Step 1- అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి New User? Register Now పైన క్లిక్ చేయాలి.
Step 3- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో ఫామ్ పూర్తి చేయాలి.
Step 4- తర్వాతి స్టెప్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
Step 5- తర్వాతి స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
Step 6- ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
Step 7- గతంలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసినవారు పైన చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో నేరుగా లాగిన్ కావాలి.
Step 8- అప్పటికే పూర్తి చేసిన వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు.
Step 9- ఫేజ్ 9 (SSC Phase 9 Notification) లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.
Step 10- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
Step 11- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.