SSC Recruitment 2021: ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..జీతం రూ.85వేలు

(ప్రతీకాత్మక చిత్రం)

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు ముందుకు వచ్చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,261 ఉద్యోగ పోస్టులు భర్తీ చేయనుంది.

  • Share this:
    SSC Recruitment 2021:  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు ముందుకు వచ్చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 3వేల 261 ఉద్యోగ పోస్టులు భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఫేజ్ 9 జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు చివరి తేదీ 2021 అక్టోబర్ 25గా నిర్ణయించారు. ఇదిలా ఉంటే మొత్తం ఖాళీలు 3261 పోస్టులుగా పేర్కొనగా, ఇందులో జనరల్ కోటాలో 1366 పోస్టులు, ఎస్సీ కోటాలో 477 పోస్టులు, ఎస్టీ కోటాలో 249 పోస్టులు, ఓబీసీ కోటాలో 788 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కోటాలో 381 పోస్టులు భర్తీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

    ఇక రీజియన్ వారీగా చూసినట్లయితే SSC ER Region 800 పోస్టులు, SSC KKR Region117 పోస్టులు, SSC MPR Region 137 పోస్టులు, SSC NR Region 1159 పోస్టులు, SSC NWR Region 618 పోస్టులు, SSC SR Region 159 పోస్టులు, SSC WR Region 271 పోస్టులు భర్తీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

    DRDO Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం అప్లై చేయండిలా..సాలరీ ఎంతంటే..


    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 2021 సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కాగా, దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 25గా నిర్ణయించారు.

    ఇక అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 28, ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 28, ఆఫ్‌లైన్ చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2021 నవంబర్ 1గా నిర్ణయించారు.

    ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ – 2022 జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించే వీలుంది.

    విద్యార్హతల విషయానికి వస్తే 10+2, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    అలాగే ఈ ఉద్యోగాలకు కనీస వయస్సు- 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

    దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు.

    వేతనం – రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.85, 500 వేతనం.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

    ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
    Published by:Krishna Adithya
    First published: