SSC Jobs: మొత్తం 5846 పోలీస్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

SSC Recruitment 2020 | పోలీస్ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC త్వరలో 5846 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

news18-telugu
Updated: July 21, 2020, 1:12 PM IST
SSC Jobs: మొత్తం 5846 పోలీస్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
SSC Jobs: మొత్తం 5846 పోలీస్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పోలీస్ ఉద్యోగం మీ కలా? పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 5846 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయాలంటూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు లేఖ ద్వారా కోరారు. ఈ పోస్టుల్ని భర్తీ చేసేందుకు త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 1564 పోస్టుల పోలీస్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ) పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ కాకుండా మరో 5846 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. అందుకే అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in ఫాలో అవుతూ ఉండాలి.

Jobs: సెంట్రల్ సిల్క్ బోర్డులో జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 580 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SSC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 5846
కానిస్టేబుల్ పురుషులు- 3433
కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్‌మెన్ పురుషులు- 226కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్‌మెన్ కమాండో పురుషులు- 243
కానిస్టేబుల్ మహిళలు- 1944
Published by: Santhosh Kumar S
First published: July 21, 2020, 1:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading