హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSC Recruitment 2020: ఆ పరీక్షలు వాయిదా.. పూర్తి వివరాలివే..

SSC Recruitment 2020: ఆ పరీక్షలు వాయిదా.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SSC Recruitment 2020: బీహార్ ఎన్నికల నేపథ్యంలో పలు పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

బీహార్ ఎన్నికల నేపథ్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వివరాలను అభ్యర్థులు గమనించాలని కమిషన్ సూచించింది. కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం వాయిదా పడిన పరీక్షల వివరాలు ఇవే..

SSC JE Paper-1 2019 Exam: ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఈ నెల 27 నుంచి 30 వరకు నిర్వహించాల్సి ఉంది. బీహార్ ఎన్నికల కారణంగా ఈ పరీక్ష వాయిదా పడింది. బీహారల్ లో పరీక్ష కేంద్రాలను ఎంచుకున్న వారికి ఈ పరీక్షను డిసెంబర్ 11న నిర్వహించనున్నారు. మిగతా అభ్యర్థులకు ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి 30 వరకు ఉంటుంది.

SSC CGL Tier-2 2019 Exam: ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి 5 వరకు జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. మార్చిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష నవంబర్ 15 నుంచి అదేనెల 18 వరకు నిర్వహించనున్నారు.

SSC Phase-8 2020 Exam: ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ 6, 9, 10 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే బీహార్ ఎన్నికల సందర్భంగా పరీక్ష తేదీలను అధికారులు మార్చారు. మార్చిన షెడ్యూల్ ప్రకారం.. బీహార్ లో పరీక్ష కేంద్రాలను ఎంచుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 14న పరీక్ష నిర్వహించనున్నారు. మిగతా అభ్యర్థులకు మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6, 9, 10 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

SSC Stenographer Grade C&D 2019 Exam: మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష నవంబర్ 16 నుంచి 18 వరకు జరగాల్సి ఉంది. అయితే ఈ తేదీలను మార్చుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్చిన షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 24 నుంచి 30 వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

SSC JE Paper-2 2019: మొదట విడుదల చేసిన పరీక్ష ప్రకారం ఈ పరీక్ష 2021, జనవరి 31న జరగాల్సి ఉంది. అయితే మార్చిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షను 2021 మార్చి 21న నిర్వహించనున్నారు.

First published:

Tags: Ssc exams, Staff Selection Commission

ఉత్తమ కథలు