హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP SSC Exams Model Papers: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫైనల్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్లు ఇవే..

AP SSC Exams Model Papers: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫైనల్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్లు ఇవే..

ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫైనల్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్లు ఇవే..

ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫైనల్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్లు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెన్త్ ఎగ్జామ్స్ కు (AP Tenth Exams) సంబంధించి ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ ఎగ్జామ్స్ కు సంబంధించి 11 పేపర్లను 7కు కుదించింది. ఇందుకు సంబంధించిన మోడల్ పేపర్లను (AP Tenth Model Papers) ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది.

ఇంకా చదవండి ...

కరోనా (Corona) నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సమయానికి పూర్తి అవుతుందా? లేదా? అన్న ఆందోళన విద్యార్థుల్లో (Students) వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని సీఎం జగన్ సర్కార్ (AP Government) ఇటీవల టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలపై (Exams) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న పరీక్షల పేపర్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు టెన్త్ ఎగ్జామ్ ను 11 పేపర్లలో నిర్వహించేవారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్యను 7కు కుదించింది జగన్ సర్కార్. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను సైతం ఏడు పేపర్లతోనే నిర్వహించున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు ఒకే ఎగ్జామ్ ఉండగా.. ఒక సైన్స్ మాత్రం రెండు పేపర్లను నిర్వహించనున్నారు. ఇందులో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి 50 మార్కులకు ఒక పేపర్, జీవశాస్త్రానికి 50 మార్కులకు ఉంటుంది.

AP SSC Exams: కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..

మిగతా అన్ని సబ్జెక్టులకు ఎగ్జామ్ ను ఒకే పేపర్ ద్వారా 100 మార్కులకు నిర్వహిస్తారు. అయితే, ఈ సిలబస్ కు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మోడల్ పేపర్లను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. విద్యార్థులు నేరుగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి మోడల్ పేపర్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందు కోసం విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

Telangana: విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో వారంతా పాస్.. అధికారిక ప్రకటన విడుదల

AP SSC SUBJECT WISE MODEL QUESTION PAPERS:

Step 1: విద్యార్థులు మొదటగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో SSC Public Examinations - 2022 Model Paper ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 3: తర్వాత మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

TS Inter Exam Fee: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజుపై బోర్డు కీలక ప్రకటన.. పూర్తి వివరాలివే

Step 4: ఆ పేజీలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి న ఇంగ్లిష్, తెలుగు మోడల్ పేపర్లకు సంబంధించిన లింక్ లు కనిపిస్తాయి.

Step 5: ప్రతీ పేపర్ పక్కర Click Here అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి మోడల్ పేపర్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Career and Courses, Ssc exams

ఉత్తమ కథలు