హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

10th Exams : రేపటి నుంచి 10 పరీక్షలు.. విద్యార్థులకు అదిరిపోయే టిప్స్

10th Exams : రేపటి నుంచి 10 పరీక్షలు.. విద్యార్థులకు అదిరిపోయే టిప్స్

విద్యార్థులకు అదిరిపోయే టిప్స్

విద్యార్థులకు అదిరిపోయే టిప్స్

10th Examinations 2023 : పదో తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు రెడీ అవుతున్నారు. బాగా రాయాలనే ఉద్దేశంతో వారిలో కొంత టెన్షన్ ఉంది. మరి బాగా రాసేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం (3-ఏప్రిల్-2023) నుంచి జరగనున్నాయి. అసలే కరోనా కేసులు పెరుగుతున్న సమయం కావడంతో.. అధికారులు ఈ పరీక్షలకు బాగా ఏర్పాట్లు చేశారు. గణాంకాలు చూస్తే.. ఈసారి 4,94,620 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వీరిలో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు. వీరంతా ఎగ్జామ్స్ రాసేందుకు మొత్తం 2,652 ఎగ్జామ్ హాల్స్ రెడీగా ఉన్నాయి. ఈసారి మొత్తం 6 పేపర్లు ఉండగా.. సిలబస్‌లో కోతలేవీ లేకుండా.. మొత్తం ఉంది.

ఈ పరీక్షల టైమ్ చూస్తే ఉదయం 9.30కి పరీక్ష మొదలవుతుంది. మధ్యాహ్నం 12.30కి ముగుస్తుంది. అంటే సంవత్సరమంతా చదివింది.. విద్యార్థులు ఆ 3 గంటల్లో పేపర్‌పై పెట్టాలి. ఇదే అసలు సవాలు. ఈ పరీక్షలు ఏప్రిల్ 13 వరకూ కొనసాగుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి వెళ్లడం మేలు. ఒకవేళ రాంగ్ కేంద్రానికి వెళ్తే.. తిరిగి సరైన కేంద్రానికి వెళ్లేందుకు వీలవుతుంది. ఆలస్యంగా వెళ్లడం ప్రమాదకరం. 9.35 లోపు వచ్చిన వాళ్లనే ఎగ్జామ్ హాల్ లోకి పంపుతామని అధికారులు తెలిపారు.

ఏర్పాట్లు ఏం చేశారు?

ఎండాకాలం కదా.. తాగునీటితోపాటూ ORS కూడా ఉంచారట. అలాగే.. వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ ఎంతో హాయిగా పరీక్షలు రాయవచ్చు.

బస్సుల్లో ఫ్రీ:

టెన్త్ విద్యార్థుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం వారు తమ హాల్ టికెట్‌ను కండక్టర్‌కి చూపించాలి. అది వారికి టికెట్‌తో సమానం.

సింపుల్ టిప్స్:

* పరీక్షలకు వెళ్లే విద్యార్థులు చివరి అరగంటకు ముందే.. చదవడం ఆపేసి.. ప్రశాంతంగా ఉండాలి. తద్వారా బ్రెయిన్ రీ ఫ్రెష్ అయ్యి.. పరీక్ష బాగా రాస్తారు.

* విద్యార్థులు ముందుగా 5 మార్కులు, 2 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాసేయాలి. తర్వాత ఎస్సే, బిట్స్ రాయడం వల్ల టెన్షన్ తగ్గుతుంది.

* పరీక్షను 3 గంటల్లో... 3 భాగాలుగా విభజించుకోవాలి. మొదటి 35 మార్కులను మొదటి గంట, తర్వాత 35 మార్కులకు 2వ గంట.. చివరి 30 మార్కులకు 3వ గంటను కేటాయించి ఆ ప్రకారం రాసుకోవాలి.

* కనీసం 4 పెన్నులు తీసుకెళ్లాలి. ఒకటి సరిగా రాయకపోతే, మరొకటి కింద పడి రాయడం మానేస్తే.. మూడోది రాసేందుకు పనికొస్తుంది. పక్కనున్న వారు అడిగితే ఇచ్చేందుకు 4వ పెన్ ఆప్షన్‌గా ఉంచుకోవాలి.

* ఆన్సర్ షీట్‌లో మీ రాత ఎంత వీలైతే అంత అందంగా ఉండేలా రాయాలి. అక్షరాలు గుండ్రంగా.. స్పష్టంగా ఉండాలి. అలా రాసేవారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలుంటాయి.

* ఆన్సర్లు పెద్ద పెద్ద పేరాలు కాకుండా.. చిన్న పేరాలతో, సబ్ హెడ్డింగ్స్‌తో రాయాలి. రాసేముందే ఆన్సర్ ఎలా రాయాలో ఓ ప్లాన్ వేసుకొని రాస్తే బాగా రాయగలరు.

* ప్రతీ ఆన్సర్‌తో పాటూ ప్రశ్నను కూడా రాయడం వల్ల.. మీ పేపర్ వాల్యుయేషన్ చేసే వారికి తేలిగ్గా ఉంటుంది. మీ కృషిని మెచ్చి.. ఎక్కువ మార్కులు వేసే ఛాన్స్ ఉంటుంది.

First published:

Tags: 10th Class Exams, Telangana News

ఉత్తమ కథలు