Home /News /jobs /

SSC MTS RECRUITMENT 2021 STAFF SELECTION COMMISSION RELEASED MULTI TASKING STAFF NON TECHNICAL EXAMINATION NOTIFICATION KNOW ELIGIBILITY AND OTHER DETAILS SS

SSC MTS Recruitment 2021: పదవ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నోటిఫికేషన్ వచ్చేసింది

SSC MTS Recruitment 2021: పదవ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నోటిఫికేషన్ వచ్చేసింది
(ప్రతీకాత్మక చిత్రం)

SSC MTS Recruitment 2021: పదవ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నోటిఫికేషన్ వచ్చేసింది (ప్రతీకాత్మక చిత్రం)

SSC MTS Recruitment 2021 | టెన్త్ పాస్ అయినవారికి శుభవార్త. 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. 10వ తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందొచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులు చాలాకాలంగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న సంగితి తెలిసిందే. మొత్తానికి నోటిఫికేషన్ వచ్చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 21 చివరి తేదీ. ఖాళీల వివరాలను ప్రకటించలేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో ఖాళీల వివరాలను అప్‌డేట్ అవుతాయి. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Candidate‟s Corner సెక్షన్‌లో Tentative Vacancy పైన క్లిక్ చేసి ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. గతంలో మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్-MTS నోటిఫికేషన్ ద్వారా 9069 పోస్టుల్ని భర్తీ చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. ఈసారి కూడా అంతే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయొచ్చు.

    NYKS Recruitment 2021: 10వ తరగతి పాస్ అయినవారికి 13,206 ఉద్యోగాలు... తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు

    SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా

    SSC MTS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    నోటిఫికేషన్ విడుదల- 2021 ఫిబ్రవరి 5
    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 5
    అప్లికేషన్‌కు చివరి తేదీ- 2021 మార్చి 21 రాత్రి 11.30 గంటలు
    ఆన్‌లైన్ ఫీజు పేమెంట్‌కు చివరి తేదీ- 2021 మార్చి 23 రాత్రి 11.30 గంటలు
    చలాన్ జనరేషన్‌కు లాస్ట్ డేట్- 2021 మార్చి 25 రాత్రి 11.30 గంటలు
    చలాన్ పేమెంట్‌కు లాస్ట్ డేట్- 2021 మార్చి 29 బ్యాంకు వేళలు ముగిసేలోపు
    కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్ 1)- 2021 జూలై 1 నుంచి జూలై 20
    టైర్ 2 ఎగ్జామినేషన్- 2021 నవంబర్ 21

    Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... ఇంటర్ పాసైతే చాలు

    IBPS Exam Calendar 2021-22: నిరుద్యోగులకు శుభవార్త... ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ ఇదే

    SSC MTS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    మొత్తం ఖాళీలు- త్వరలో వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్
    విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి
    వయస్సు- 2021 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    ఎంపిక విధానం- రెండు దశల పరీక్ష
    తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

    ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Staff Selection Commission

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు