Home /News /jobs /

SSC MTS RECRUITMENT 2021 STAFF SELECTION COMMISSION INVITES APPLICATIONS FOR MULTI TASKING STAFF EXAMINATION FROM 10TH PASSED CANDIDATES KNOW HOW TO APPLY SS

SSC MTS Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్... అప్లై చేయండి ఇలా

SSC MTS Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

SSC MTS Recruitment 2021: టెన్త్ పాస్ అయినవారికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SSC MTS Recruitment 2021 | టెన్త్ పాసయ్యారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

    స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్-MTS నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. టెన్త్ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 21 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత దరఖాస్తు చేయాలి. మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

    NYKS Recruitment 2021: 10వ తరగతి పాస్ అయినవారికి 13,206 ఉద్యోగాలు... తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు

    HCL Recruitment Drive: విజయవాడలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 1000 ఉద్యోగాలు... రిక్రూట్‌మెంట్ డ్రైవ్ వివరాలివే

    SSC MTS Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    ఆ తర్వాత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం New User? Register Now పైన క్లిక్ చేయాలి.
    మీ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు లాంటి బేసిక్ డీటెయిల్స్‌తో మొదటి ఫామ్ పూర్తి చేయాలి.
    తర్వాతి స్టెప్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
    మూడో స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
    ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
    గతంలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా లాగిన్ కావొచ్చు.
    రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీరు అప్పటికే పూర్తి చేసిన వివరాలు కనిపిస్తాయి.
    ఆ వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు.
    ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్-MTS నోటిఫికేషన్‌కు అప్లై చేయాలి.
    ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Staff Selection Commission

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు