SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

SSC MTS 2019 Recruitment | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in లో నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తు చేయడానికి 2019 మే 29 చివరి తేదీ.

news18-telugu
Updated: April 22, 2019, 11:05 AM IST
SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
  • Share this:
నిరుద్యోగులకు మరో శుభవార్త. మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ టెక్నికల్) నియామకాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో సుమారు 1000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఖాళీల వివరాలను ప్రకటించకపోయినా ఆ నోటిఫికేషన్‌ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in లో నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తు చేయడానికి 2019 మే 29 చివరి తేదీ. రెండు అంచెల రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నిమాయకం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Read this: RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? జాగ్రత్త అంటున్న ఆర్ఆర్‌బీ

SSC MTS notification 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు



మెట్రిక్యూలేషన్ లేదా తత్సమాన పరీక్ష పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. టైర్-1 పరీక్ష జూలై 2 నుంచి ఆగస్ట్ 6 మధ్య, టైర్-2 పరీక్ష నవంబర్ 17న ఉంటుంది. టైర్-1, టైర్-2 పరీక్షలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ విధానంలో ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోండి.



Read this: SBI clerk Jobs: ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...

SSC MTS notification 2019: దరఖాస్తు చేసుకోండి ఇలా...


ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఓపెన్ చేయండి. హోమ్‌ పేజీలో ‘log-in’ సెక్షన్‌లో ‘register now’ పైన క్లిక్ చేయండి. మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి. దరఖాస్తు పూర్తి చేయి ఇమేజెస్ అప్‌లోడ్ చేయండి. చివరగా పేమెంట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఎంపికైన వారికి రూ.20,200 వరకు వేతనం లభిస్తుంది. గతేడాది 10,000 మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ని నియమించింది ఎస్ఎస్‌సీ. ఈసారి కూడా అన్నే పోస్టులు ఉంటాయని అంచనా. ప్రస్తుతమైతే ఖాళీల వివరాలను ప్రకటించలేదు. ఖాళీల వివరాల కోసం ssc.nic.in వెబ్‌సైట్‌లో ‘students corner’ సెక్షన్‌లో ‘tentative vacancies’ క్లిక్ చేసి త్వరలో తెలుసుకోవచ్చు.
Loading...
Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు

ఇవి కూడా చదవండి:

IRCTC: రైల్వే కౌంటర్‌లో కొన్న టికెట్ ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయడానికి 10 స్టెప్స్

SBI Loan: ఎస్‌బీఐలో ఎడ్యుకేషన్ లోన్... ఇలా తీసుకోవచ్చు

Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు ఇవే...
First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...