SSC JE Steno Recruitment 2020: ఆ అభ్యర్థులకు SSC కీలక సూచన.. పూర్తి వివరాలివే..

SSC JE Steno Recruitment 2020: ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్ గ్రూప్-C మరియు గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులకు గురువారం కమిషన్ ముఖ్యమైన గమనికను విడుదల చేసింది.

news18-telugu
Updated: October 23, 2020, 1:33 PM IST
SSC JE Steno Recruitment 2020: ఆ అభ్యర్థులకు SSC కీలక సూచన.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్ గ్రూప్-C మరియు గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులకు గురువారం కమిషన్ ముఖ్యమైన గమనికను విడుదల చేసింది. జేఈ2020, స్టెనోగ్రాఫర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు గడువు తేదీకి ముందుగానే ఆన్లైన్ లో అప్లికేషన్ పంపించాలని సూచించింది. అక్టోబర్ 1న SSC జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ గ్రూప్-C, గ్రూప్-D పోస్టుల భర్తీకి అక్టోబర్ 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 30 ఆఖరు తేదీగా నిర్ణయించారు, స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 4ను చివరి తేదీ అని కమిషన్ వెల్లడించింది.

Check official notice here

అయితే అభ్యర్థులకు ముఖ్య గమనికను కమిషన్ విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ 2020, స్టెనోగ్రాఫర్ గ్రూప్C, గ్రూప్D పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఆఖరు తేదీ అయిన అక్టోబర్ 30, నవంబర్ 4 కన్నా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఖరు తేదీ వరకు ఆగకపోవడం మంచిదని తెలిపింది. గడువు సమీపిస్తున్న కొద్దీ సర్వర్లపై హెవీ ట్రాఫిక్ ఉండే ప్రమాదం ఉందని కమిషన్ వివరించింది. కాగా.. JE టైర్ 1 పరీక్షను 2021 మార్చి 22 నుంచి 25 వరకు స్టెనోగ్రాఫర్ పరీక్షను మార్చి 29 నుంచి 31 వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు.

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIIMS న్యూ ఢిల్లీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ ఏ, బీ, సీలో 39 రకాల పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 214 ఖాళీలను ప్రకటించింది. వెటర్నరీ ఆఫీసర్, టెక్నీషియన్, ప్రోగ్రామర్, జూనియర్ ఇంజనీర్, లైబ్రేరియన్, సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలుంటాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.aiims.edu/ లేదా aiimsexams.org వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్స్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
Published by: Nikhil Kumar S
First published: October 23, 2020, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading