Home /News /jobs /

SSC JE RESULTS RELEASED AND ALSP ANNOUNCED OTHER SSC EXAMS SHEDULE EVK

SSC Results: ఎస్ఎస్‌సీ జేఈ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఇత‌ర‌ ప‌రీక్ష‌ల షెడ్యూల్ వివ‌రాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

SSC Exam Results: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) న‌వంబ‌ర్ 23, 2021న జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్ (Mechanical), ఎలక్ట్రికల్ అండ్‌ క్వాంటిటీ సర్వేయింగ్ మరియు కాంట్రాక్ట్స్) పరీక్ష, 2019 ఫలితాలను ప్రకటించింది. అంతే కాకుండా ఇత‌ర ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను వెల్ల‌డించింది.

ఇంకా చదవండి ...
    స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) న‌వంబ‌ర్ 23, 2021న జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్ (Mechanical), ఎలక్ట్రికల్ అండ్‌ క్వాంటిటీ సర్వేయింగ్ మరియు కాంట్రాక్ట్స్) పరీక్ష, 2019 ఫలితాలను ప్రకటించింది. పరీక్షలో హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను SSC అధికారిక‌ వెబ్‌సైట్ https://ssc.nic.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. కమిషన్ నిర్ణయించిన కట్-ఆఫ్ మార్కుల (పేపర్-I + పేపర్-II) ఆధారంగా ఫలితాలు ప్రకటించించారు. మొత్తం 2,532 మంది అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ (Civil Engineering) పరీక్షలో ఉత్తీర్ణత సాధించగా, 358 మంది మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరీక్షకు అర్హత సాధించారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ (Document Verification) కు హాజరయ్యేందుకు మొత్తం 2,890 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

    ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల‌కు సంబంధించి అర్హ‌త సాధించిన వారు, సాధించ‌ని వారికి సంబంధించిన మార్కుల‌ను న‌వంబ‌ర్ 30, 2021న విడుద‌ల చేస్తామ‌ని క‌మిష‌న్ పేర్కొంది. మార్కులు విడుద‌ల అయిన త‌రువాత వెబ్‌సైట్‌లో మార్కుల లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట‌ర్ నంబ‌ర్‌, పాస్‌వ‌ర్డ్ ఇచ్చి ఫ‌లితాలు చూసుకోవాలి.

    Amazon AWS Training Courses: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. కొత్త ఏడబ్ల్యూఎస్ స్కిల్ సెంట‌ర్‌కు అమెజాన్ క‌స‌ర‌త్తు


    ఫ‌లితాల అనంత‌రం..
    - ఈ ప‌రీక్ష‌లో పేపర్ IIలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు తాత్కాలికంగా డిసెంబర్ 2021 నెల ద్వితీయార్థంలో నిర్వహించబడే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరవుతారు.
    - డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరైన అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిట్ కార్డులు సంబంధిత ప్రాంతీయ కార్యాలయాల వెబ్‌సైట్లలో త్వరలో అప్‌లోడ్ చేస్తారు.
    - అడ్మిట్ కార్డుల విడుదల తేదీ ఇంకా క‌మిష‌న్ వెల్ల‌డించ‌లేదు.

    ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌..
    ఈ ఫ‌లితాలే కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) రాబోయే నెలల్లో నిర్వహించాల్సిన వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది.
    - కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (CGL) 2020 టైర్ 2, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ (CHSL), 2020 టైర్ 2 జనవరిలో జరుగుతుందని తెల‌పింది.
    - CGLE 2020 టైర్ 3 మరియు సెలక్షన్ పోస్ట్‌ను జనవరిలో నిర్వహించనున్నట్లు కమిషన్ తన అధికారిక ప్రకటనలో ప్రకటించింది. (ఫేజ్-IX) పరీక్ష, 2021 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు.
    - కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో SSC పరీక్షల క్యాలెండర్ 2020-21ని PDF రూపంలో జారీ చేసింది.

    నెల్లూరు డీసీసీబీలో ఉద్యోగాలు.. జీతం రూ. 33,000


    ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌ (Nellore District Co Operative Central Bank Limited)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

    National Scholarship: వారం రోజులే గ‌డువు.. రూ.70వేల స్కాల‌ర్‌షిప్‌ పొందేందుకు అప్లై చేసుకోండి


    ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో 65 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌ (Online)లోనే ఉంటుంది. రెగ్యుల‌ర్‌గా బ్యాంక్ జాబ్స్ (Bank Jobs) చ‌దివేవారికి ఇది మంచి అవ‌కాశంగా ఉంటుంది. బ్యాంక్ ప్రిప‌రేష‌న్ చేసే వారికి సేమ్ సెల‌బ‌స్‌తో ప‌రీక్ష ఉండ‌నుంది. ఈ పోస్టుల వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు విధానం (Application Process) కోసం అధికారిక వెబ్‌సైట్ http://nelloredccb.com/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 3, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.  పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Exam results, Ssc exams, Staff Selection Commission

    తదుపరి వార్తలు