స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్ ను(Notification) విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSF, రైఫిల్‌మ్యాన్ (GD) మరియు అస్సాంలోని 45,284 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్(Constable) ఖాళీల కోసం అర్హత, ఆసక్తిగ అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే దరఖాస్తుల గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. నవంబర్ 30, 2022 చివరి తేదీగాగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
మొత్తం పోస్టులు 24,369
విభాగం | పోస్టులు |
బీఎస్ఎఫ్(BSF) | 20,765 |
సీఐఎస్ఎఫ్(CISF) | 5914 |
సీఆర్పీఎఫ్(CRPF) | 11,169 |
ఎస్ఎస్బీ(SSB) | 2167 |
ఐటీబీపీ(ITBP) | 1787 |
ఏఆర్(AR) | 3153 |
ఎస్ఎస్ ఎఫ్(SSF) | 154 |
ఎన్సీబీ(NCB) | 175 |
మొత్తం (Total) | 45,284 |
అర్హతలు..
ఏదైనా గుర్తింపు పొందిన బోర్ట్ నుంచి 10వ/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పురుష అభ్యర్థుల యొక్క ఎత్తు 170 సె.మీ లకు తగ్గకూడదు. మహిళా అభ్యర్థులకైతే.. 157 సెం.మీలకు తగ్గకూడదు.
వయో పరిమితి.. జనవరి 01, 2023 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
ముఖ్యమైన తేదీలు.
SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ - 27 అక్టోబర్ 2022
SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ - 27 అక్టోబర్ 2022
SSC GD ఆన్లైన్లో దరఖాస్తు 2022 ప్రారంభం - 27 అక్టోబర్ 2022
దరఖాస్తు ఫారమ్ నింపడానికి చివరి తేదీ - 30 నవంబర్ 2022
ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ - 1 డిసెంబర్ 2022
ఆఫ్‌లైన్ చలాన్ రూపొందించడానికి చివరి తేదీ - 30 నవంబర్ 2022
చలాన్ ద్వారా చెల్లింపుకు చివరి తేదీ - 1 డిసెంబర్ 2022
SSC GD అప్లికేషన్ స్టేటస్ - జనవరి 2023
SSC GD అడ్మిట్ కార్డ్ - జనవరి 2023
SSC GD పరీక్ష తేదీ 2022 - జనవరి 2023
SSC GD జవాబు కీ - ఫిబ్రవరి 2023
SSC GD ఫలితాల ప్రకటన - మార్చి 2023
Railway Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ రైల్వేలోఉద్యోగాలు .. ఇలా దరఖాస్తు చేసుకోండి
జీతం..
ఎన్సీబీలో సిపాయిలకు.. నెలకు రూ. 18,000 నుండి 56,900 మధ్య చెల్లిస్తారు.
BSF, CRPF, CISF, ITBP, SSF, SSB, NIA మరియు రైఫిల్‌మెన్ పోస్టులకు రూ. 21,700-69,100 మధ్య చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.
-రాత త పరీక్ష (కంప్యూటర్ ఆధారిత)
-ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
-ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
-వైద్య పరీక్ష
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 30 లోగా https://ssc.nic.in/ వె బ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Ssc, Staff Selection Commission