హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSC CHSL Notification Out: ఎస్సెస్సీ నుంచి CHSL నోటిఫికేషన్ విడుదల.. భారీగా పోస్టులు ఖాళీ..

SSC CHSL Notification Out: ఎస్సెస్సీ నుంచి CHSL నోటిఫికేషన్ విడుదల.. భారీగా పోస్టులు ఖాళీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవల్ లో(CHSL) ఖాళీగా ఉన్న పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) నుంచి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4500 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎల్డీసీ పోస్టులకు జీతం రూ.19,900 నుంచి రూ. 63,200 మధ్య చెల్లిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు జీతం రూ.25,500 నుంచి రూ. 81,100 మధ్య చెల్లించనున్నారు.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. DEO(Date Entry Operator)పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి సైన్స్ స్ట్రీమ్ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా.. విద్యార్థి 12వ తరగతిలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. SSC CHSL ఎగ్జామ్‌కు అప్లికేషన్ ఫీజు రూ. 100. అయితే మహిళలు, SC, ST, శారీరక వికలాంగులు లేదా మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు ఉండదు.

వియోపరిమితి: అభ్యర్థుల యొక్క వయస్సు జనవరి 01, 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. దానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తులు ప్రారంభం - డిసెంబర్ 06, 2022

దరఖాస్తులకు చివరి తేదీ - జనవరి 04, 2023

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ - జనవరి 04, 2023

తప్పుడ సవరణకు అవకాశం- జనవరి 09, 2023

టైర్ 1 పరీక్ష తేదీ - ఫిబ్రవరి, మార్చి 2023

టైర్ 2 పరీక్ష తేదీ - త్వరలో షెడ్యూల్ చేయబడుతుంది.

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్..

సీహెచ్‌ఎస్‌ఎల్ ఎగ్జామ్‌కు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక ఐటీ ప్రూఫ్‌ను సిద్ధం చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి డెబిట్/క్రెడిట్ కార్డ్ అవసరం. కాస్ట్ కర్టిఫికెట్, 10వ, 12వ తరగతుల మార్క్ షీట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్, అభ్యర్థి సంతకం.. వంటి వాటిని స్కాన్ చేసి పెట్టుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

- అభ్యర్థులు ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inకి వెళ్లండి.

-ఆపై హోమ్ పేజీలో “SSC CHSL ఆన్‌లైన్‌లో అప్లై” లింక్‌పై క్లిక్ చేయండి.

-తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్ వర్డ్ లను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

-పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు మరియు ఇతర అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

-చివరగా అప్లికేషన్ సమర్పించిన తర్వాత.. అభ్యర్థి దానిని ప్రింట్ అవుట్ తీసుకోవాలి

ఎగ్జామ్ ప్యాటర్న్..

CHSL ఎగ్జామ్ రెండు విభాగాలుగా జరుగుతుంది. టైర్-I అనేది డిస్క్రిప్టివ్ పేపర్, స్కిల్ టెస్ట్ లేదా టైప్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్‌లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కులు తీసివేస్తారు. టైర్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు టైర్-2కి అర్హులు. టైర్-II పరీక్ష  కూడా ఆన్ లైన్  లో ఉంటుంది.

First published:

Tags: Chsl, Ssc, Staff Selection Commission

ఉత్తమ కథలు