హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Brain Teaser: త్వరలో SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్.. లాస్ట్ ఇయర్ పేపర్‌లోని క్వశ్చన్స్‌పై ఓ లుక్కేయండి..

Brain Teaser: త్వరలో SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్.. లాస్ట్ ఇయర్ పేపర్‌లోని క్వశ్చన్స్‌పై ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2023 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14 వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యే అభ్యర్థులందరూ ప్రిపరేషన్ చివరి దశకు చేరుకున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Brain Teaser: విద్యార్థులు బోర్డ్‌ ఎగ్జామ్స్‌, అభ్యర్థులు పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో పూర్తిగా నిమగ్నమయ్యారు. వరుసగా వివిధ పరీక్షల నోటిఫికేషన్‌లు విడుదలవుతున్నాయి. SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష(SSC GD Constable Recruitment Exam)2023 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14 వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యే అభ్యర్థులందరూ ప్రిపరేషన్ చివరి దశకు చేరుకున్నారు. కాబట్టి ఈ సమయంలో సాధారణంగానే ఒత్తిడికి లోనవుతుంటారు. కొందరికి ఎంత చదివినా.. ఏదో మిస్‌ అయ్యామనే ఫీలింగ్ ఉంటుంది. ఇటువంటి సమయంలో పాత ఎగ్జామ్ పేపర్లను రివిజన్ చేయడం మంచిది. వాటిలో ఉన్న క్వశ్చన్స్ రిఫర్ చేస్తూ ప్రిపరేషన్‌ కొనసాగిస్తే.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

 పరీక్ష విధానం

GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ (CBT) పరీక్ష మొత్తం 160 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు మొత్తం 40 మార్కులకు ఉంటాయి. పరీక్షను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 60 నిమిషాల సమయం ఉంటుంది. పేపర్‌లో మొత్తం ప్రశ్నలలో 80 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి,మొత్తం స్కోర్ నుండి 0.50 మార్కులు మైనస్ చేస్తారు. GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు ఎగ్జామ్ కి ఉపయోగపడేలా 2021 పేపర్‌లో అడిగిన 10 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీకోసం..

ప్రశ్న 1. కిరణజన్య సంయోగక్రియ కోసం మొక్కలకు ఏ వాయువు అవసరం?

సమాధానం- కార్బన్ డయాక్సైడ్

ప్రశ్న 2. నీటిలో ఏ పొడిని కలపడం ద్వారా క్లోరినేషన్ జరుగుతుంది?

సమాధానం- బ్లీచింగ్ పౌడర్

ప్రశ్న 3. జనరల్ డయ్యర్‌ను ఏ స్వాతంత్ర్య సమరయోధుడు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి?

సమాధానం- ఉధమ్ సింగ్

ప్రశ్న 4. ఏ పర్వత శ్రేణిని పరిధిని ఆసియాకు వెన్నెముకగా పిలుస్తారు?

సమాధానం- కారకోరం పరిధి

ప్రశ్న 5. ఢిల్లీ సుల్తాన్‌ను ఓడించి బాబర్ ఏ సంవత్సరంలో ఢిల్లీ,ఆగ్రాలను స్వాధీనం చేసుకున్నాడు?

సమాధానం- 1526

ప్రశ్న-6. 1961లో, US ఫెడరల్ రిజర్వ్ దీర్ఘకాలిక రేట్లను తగ్గించడం ద్వారా US ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు రూపొందించిన ద్రవ్య విధానాన్ని ప్రారంభించింది. ఈ చొరవను భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ 2019లో ఆమోదించింది. ఈ ద్రవ్య విధానం పేరు ఏమిటి?

సమాధానం- ఆపరేషన్ ట్విస్ట్

CRPF Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సీఆర్పీఎఫ్ నుంచి 1458 ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

ప్రశ్న-7. దాదాభాయ్ నౌరోజీ తన ఏ పుస్తకం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ పాలన ఆర్థిక ప్రభావాలను తీవ్రంగా విమర్శించారు?

సమాధానం- పావర్టీ అండ్ అన్-బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా.

ప్రశ్న-8. గుజరాత్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఎప్పుడు నిర్వహిస్తారు?

సమాధానం- జనవరి 2

ప్రశ్న-9. మండో పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించినది?

సమాధానం- గోవా

ప్రశ్న-10. లెన్స్ ల శక్తికి సంబంధించిన SI యూనిట్ ఏ అక్షరంతో సూచించబడుతుంది?

సమాధానం - D

First published:

Tags: Career and Courses, Jobs Exams

ఉత్తమ కథలు