హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSC GD Constable Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 24వేల కానిస్టేబుల్ జాబ్స్.. వయోపరిమితిపై కీలక నిర్ణయం

SSC GD Constable Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 24వేల కానిస్టేబుల్ జాబ్స్.. వయోపరిమితిపై కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC). ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ (GD) పోస్టులకు గరిష్ట వయోపరిమితిని తొలగించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC). ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ (GD) పోస్టులకు గరిష్ట వయోపరిమితిని తొలగించింది. సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్ (CAPF), SSF, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఖాళీల కోసం ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడటం, నోటిఫికేషన్లు (Job Notifications) రాకపోవడంతో ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఏజ్ లిమిట్‌ను మూడేళ్ల పాటు పెంచుతున్నట్లు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ అక్టోబర్ 27న విడుదలైంది. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి చివరి తేదీ నవంబర్ 30. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 24369 ఖాళీ పోస్టులను ఎస్‌ఎస్‌సీ భర్తీ చేయనుంది.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులందరూ తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారు రూ. 100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), మాజీ సైనికులు (ESM) అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

IB Recruitment 2022: ఇంటెలిజెన్స్ బ్యూరోలో టెన్త్ అర్హతతో 1671 జాబ్స్.. ప్రారంభమైన దరఖాస్తులు.. మరికొన్ని రోజులే ఛాన్స్

ఎలా ఎంపిక చేస్తారు..?

ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ ఐదు దశల్లో జరుగుతుంది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్ (DME/ RME), డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి ఐదు దశల్లో ఎంపిక చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ క్లియర్ చేసిన వారికి NCB సిపాయి పోస్టుకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు జీతం లభిస్తుంది. ఇతర పోస్టులకు రూ. 21,700 నుండి 69,100 మధ్య జీతం లభిస్తుంది.

ఖాళీలు, అర్హత వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా BSFలో 10497 పోస్టులు, CISFలో 100 పోస్టులు, CRPFలో 8911 పోస్టులు, SSBలో 1284 పోస్టులు, ITBPలో 1613 పోస్టులు, ARలో 1697 పోస్టులు, SSFలో 103 పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2023 జనవరి 1 నాటికి 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 2000 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. అయితే ఈసారి గరిష్ట వయోపరిమితి లేదు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అభ్యర్థులందరికీ వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు ఇవ్వాలని SSC నిర్ణయించింది.

First published:

Tags: Central Government Jobs, JOBS, Police jobs, Ssc, Staff Selection Commission

ఉత్తమ కథలు