హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSC GD Constable Recruitment 2021: టెన్త్ పాసైన మహిళలకు 2847 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

SSC GD Constable Recruitment 2021: టెన్త్ పాసైన మహిళలకు 2847 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెన్త్ పాసైన మహిళలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. ఇటీవల విడుదల చేసిన 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్లో 2847 పోస్టులను మహిళలకు కేటాయించింది.

  ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 25,271 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ(GD) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్-CAPF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(SSF) లాంటి సంస్థల్లో ఈ పోస్టులు ఉన్నాయి. అయితే ఈ మొత్తం 25,271 పోస్టుల్లో 2847 పోస్టులను మహిళా అభ్యర్థులకు కేటాయించారు.

  TMREIS Recruitment 2021: తెలంగాణ మైనార్టీ కాలేజీల్లో 840 జూనియర్ లెక్చరర్ పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే

  ONGC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. ONGCలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్

  అభ్యర్థుల అర్హతల వివరాలు..

  అభ్యర్థుల వయస్సు 18-23 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు ఆగస్టు 2, 1998 నుంచి ఆగస్టు 1, 2003 వరకు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST) మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) ఆధారంగా ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా https://ssc.nic.in/ వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.

  ముఖ్యమైన తేదీలు:

  -దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 17

  -దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 31 రాత్రి 11.30 గంటలు

  -ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 2 రాత్రి 11.30 గంటలు

  -ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 4 రాత్రి 11.30 గంటలు

  -ఆఫ్‌లైన్ చలానా చెల్లించడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 7 బ్యాంకు వేళలు ముగిసేలోగా

  -అడ్మిట్ కార్డుల విడుదల- తేదీ త్వరలో విడుదలవుతుంది.

  -కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్- తేదీ త్వరలో విడుదల అవుతుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: JOBS, Police jobs, Ssc, Staff Selection Commission

  ఉత్తమ కథలు