SSC Exams: టెన్త్ తెలుగు సబ్జెక్టులో మంచి మార్కులు సాధించడం ఎలా..?

తెలుగు మాతృభాషే అయినప్పటికీ .. దాని పట్ల కాస్త జాగురుకతగా ఉండకపోతే అనవసరంగా మార్కులను వదులుకోవాల్సివస్తుంది. పాదభంగాలు లేకుండా రాయడానికి.. పద్యాలను కంఠస్థం చేయడం ప్రాక్టీస్ చేయాలి.

news18-telugu
Updated: March 18, 2020, 9:09 AM IST
SSC Exams: టెన్త్ తెలుగు సబ్జెక్టులో మంచి మార్కులు సాధించడం ఎలా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగు సబ్జెక్టుకు తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం వస్తుందంటున్నారు అధ్యాపకులు. తెలుగు మాతృభాషే అయినప్పటికీ .. దాని పట్ల కాస్త జాగురుకతగా ఉండకపోతే అనవసరంగా మార్కులను వదులుకోవాల్సివస్తుంది.  వ్యాకరణం మీద పట్టు సాధించాలి. పాదభంగాలు లేకుండా  రాయడానికి.. పద్యాలను  కంఠస్థం చేయడం ప్రాక్టీస్ చేయాలి. వ్యక్తీకరణ అంశాల్లో విద్యార్ధులు వారి సృజనాత్మకతను ప్రదర్శిస్తే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందంటున్నారు తెలుగు అధ్యాపకులు కృష్ణ.

 

పదోతరగతి తెలుగు లో విద్యార్ధులకు చిట్కాలు

1. పదోతరగతి తెలుగు పాఠ్యంశ విషయం లో ముఖ్యం ‘చేతిరాత’ చాలా ప్రధానమైంది. మనం ఎంత స్పష్టంగా అర్థమయ్యేలా రాస్తే అంత మంచి మార్కులు సాధించవచ్చు. ప్రతి ప్రశ్నకు తప్పలు లేకుండా రాస్తే 1 మార్కు కేటాయించాలని ఉంది. అందుకే అక్షర దోషాల్లేకుండా, విరామ చిహ్నాలను పాటిస్తూ, పేరాలుగా విభజించి రాయాలి.

2. వాక్య నిర్మాణం లోపిస్తే చెప్పాలనుకున్న భావం వేరే అర్థంగా మారిపోయే ప్రమాదం ఉంది. రాసేటప్పుడు పూర్తి వాక్యనిర్మాణాన్ని మనసులో అనుకొని ఒక్కొక్కటిగా పూర్తి చేయాలి. కొట్టివేతలు లేకుండా జాగ్రత్త పడాలి.

3. ప్రతి పాఠంలో భావాలను, సారంశాలను ప్రధానంగా గుర్తు పెట్లుకోవాలి. తెలుగు పై సామర్ధ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు వస్తాయి కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి.

4. పరీక్ష హాల్ లోకి వెళ్లి ప్రశ్నపత్రం అందుకున్న తరువాత దాన్ని పూర్తి ఏకాగ్రత తో చదవాలి.  ప్రశ్నపత్రం చదవడానికి  20 నిముషాలపాటు టైం కేటాయించడం మంచిదంటారు అధ్యాపకులు.5. సంధులు సమాశాలు పై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటిపై చాలా దృష్టిపెట్టాలి.

తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయి. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగుస్తాయి.

వీడియో ఇక్కడ చూడండి:
Published by: Shiva Kumar Addula
First published: March 18, 2020, 9:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading