పరీక్షలకు ఎంత బాగా సన్నద్ధమైనది ముఖ్యం కాదు. చదివిన దాన్ని ఉన్న సమయంలో ఎలా రాశామన్నది ముఖ్యం. బాగా ప్రిపేర్ అయినప్పటికీ కొన్ని సందర్భల్లో టైమ్ సరిపోక చాలా ప్రశ్నలను విద్యార్థులు వదలిలేస్తుంటారు. ముఖ్యంగా పదోతరగతి ఫిజిక్స్‌లో ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే సరైన ప్రణాళికతో విద్యార్ధులు సన్నద్ధమైతే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయంటున్నాని రవీంద్ర భారతి స్కూల్స్ ఫిజిక్స్ టీచర్ కోటేశ్వర రావు చెబుతున్నారు.
విద్యార్థులకు చిట్కాలు:
చాలా మంది విద్యార్థులు సమాధానాలు గుర్తుపెట్టుకోవడంపైనే సాధన చేస్తారు. కానీ వేగంగా రాయడంపైనా సాధన చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
గత ఏడాది పరీక్ష పత్రాలు తీసుకొని ప్రాక్టిస్ చేయడం మంచిది. అందులో ఇచ్చిన ప్రశ్నలకు ఎంత సమయంలో సమాధానాలు రాస్తున్నారో ఒకసారి బేరేజు వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ముఖ్యంగా ఫిజిక్స్‌లో బొమ్మలు గీసేటప్పుడు లేదా ఫార్ములాలు రాసేటప్పుడు నిర్దిష్టమైన సమయంలో సమాధానాలు రాసే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
ప్రతి ఏడాది క్రమం తప్పకుండ వచ్చే ముఖ్యమైన ప్రశ్నలన్ని ఒకటికి రెండు సార్లు చదవడం, ఆ సమాధానాలను ప్రాక్టీస్ చేయడం కూడా చాలా అవసరం.
పిల్లలలు చదువుతున్నప్పుడు ఆ బాధ్యత తల్లిదండ్రులపైనా ఉంటుంది. అందుకే పిల్లలలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వైఫై, టీవీలు ఆఫ్ చేయాలి. చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించాలి.
స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశారు. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.