Home /News /jobs /

SSC EXAM TIPS HOW TO DEAL WITH CHILDREN DURING EXAM SEASON SK

Exam Tips | పిల్లల పరీక్షల వేళ తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఠ్యాంశాలపై విద్యార్థులకు మంచి పట్టు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేనిదే పెద్ద పెద్ద విజయాలు సాధించడం కష్టమవుతుంది. పిల్లలు చేయలేని పనుల్లో తల్లిదండ్రులు వారికి బాసటగ నిలవాలి.

  పిల్లల పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పరీక్షలంటే టెన్షన్ పడే పిల్లలను.. మార్కులు, ర్యాంకుల పేరుతో మరింత ఒత్తిడిలోకి నెట్టకూడదు. అంతేకాదు పాఠ్యాంశాలపై విద్యార్థులకు మంచి పట్టు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేనిదే పెద్ద పెద్ద విజయాలు సాధించడం కష్టమవుతుంది. పిల్లలు చేయలేని పనుల్లో తల్లిదండ్రులు వారికి బాసటగ నిలవాలి. దాంతో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా రాణించగలమనే నమ్మకం పిల్లల్లో ఏర్పడుతుందని అధ్యాపకులు శిరీష అంటున్నారు.

  పిల్లలతో తల్లిదండ్రులు చేయకూడనివి

  ర్యాంకుల, మార్కులు అంశాల్లో పక్క పిల్లలతో పోల్చడం చేయకూడదు. అలా చేస్తే పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని  దెబ్బతీసిన వాళ్లమవుతాము.

  నీ చదువుకు అంత ఖర్చు పెడుతున్నాము ఇంత ఖర్చుపెడుతున్నాము అని పిల్లల వద్ద మాట్లాడకూడదు.

  పిల్లల ఆత్మస్థార్యన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదు.

  ఎదైనా సబ్జెక్ట్‌లో పిల్లలు ఇబ్బంది పడుతుంటే వారికి సహయం చేయడానికి తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించాలి.

  పిల్లలు సమయానికి తిని, సరిపడా నిద్రపోవడానికి తల్లిదండ్రులు సహకరించాలి.

  పిల్లలతో ఎప్పుడు ర్యాంకులు, మార్కులు గురించి ప్రస్తవించకపోవడం ఉత్తమం.

  స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ని ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Exam Tips, Ssc exams

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు