Home /News /jobs /

SSC EXAM PREPARATION 2065 JOBS IN STAFF SELECTION COMMISSION EXAM PATTERN PREPARATION PLAN DETAILS EVK

SSC Exam Preparation: స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌లో 2065 జాబ్స్‌.. ఎక్జామ్ ప్యాట‌ర్న్‌, ప్రిప‌రేష‌న్ ప్లాన్ వివ‌రాలు

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

SSC Exam Preparation | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X-2022 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప‌రీక్షకు సంబంధించి ఎక్జామ్ ప్యాట‌ర్న్‌, ప్రిప‌రేష‌న్ టిప్స్ తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X-2022 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ssc.nic.inల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 13లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కంప్యూటర్ మోడ్‌లో ఆగస్టు 2022లో జరుగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2065 ఖాళీలను ఎస్‌ఎస్‌సీ భర్తీ చేయనుంది.  ఈ నేపథ్యంలో  పరీక్ష విధానం తెలుసుకొని ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం  చేసుకొంటే కేంద్ర కొలువు సాధించడం పెద్ద కష్టమేమి కాదు.

  AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో జాబ్స్.. నేరుగా వాక్ ఇన్ ద్వారా ఎంపిక‌.. అర్హ‌త‌ల వివ‌రాలు

  ఈ పరీక్షలో వ‌చ్చే విభాగాలు..
  (i) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
  (ii) జనరల్ ఇంటెలిజెన్స్
  (iii) ఇంగ్లీష్‌
  (iv) జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్

  ప‌రీక్షా విధానం..

  స‌బ్జెక్ట్ప్ర‌శ్న‌లుమార్కులు
  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్2550
  జనరల్ ఇంటెలిజెన్స్2550
  ఇంగ్లీష్‌2550
  జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్2550
  మొత్తం100200

  ఎక్జామ్ టిప్స్..

  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో సాధారణంగా ప్రతి సంవత్సరం కొన్ని పునరావృతమయ్యే ప్రశ్నలు ఉంటాయి. ఈ అంశాల‌ను గుర్తిస్తే జనరల్ నాలెడ్జ్ చాలా స్కోరింగ్ కావచ్చు.

  Internship: ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దుతున్నారా.. నెల‌కు రూ.15,000ల స్టైఫండ్‌తో ఇంట‌ర్న్‌షిప్ ఆఫ‌ర్‌!

  - గణితానికి సంబంధించిన బేసిక్స్‌పై ఎక్కువ ప్ర‌శ్న‌లు అడుగుతారు. కాబ‌ట్టి పెద్ద సూత్రాల కంటే మౌలిక సూత్రాల అభ్యాసం అవ‌స‌రం.

  - ఈ పరీక్ష తయారీకి కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం. సొంతంగా నోట్స్ చేసుకొవ‌డం వ‌ల్ల క‌రెంట్ ఎఫైర్స్ త‌ప్పులు లేకుండా ఆన్సర్ చేయొచ్చు.

  - తెలుగు మీడియం (Telugu Medium) నుంచి వ‌చ్చే వారికి ఇంగ్లీష్ (English) కాస్త క‌ఠినంగా అనిపించినా.. పర్యాయపదాలు, వ్యతిరేకపదాలు, వన్-వర్డ్ సబ్‌స్టిట్యూషన్ & ఇడియమ్స్/పదబంధాలు అభ్య‌సం చేసినా మంచి స్కోర్ చేయొచ్చు.

  Note - అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం నెగిటీవ్ మార్కింగ్. 0.5 మార్కులు ప్రతీ తప్పు ప్రశ్నకు నష్టపోతారు కాబట్టి కచ్చిమైన సమాధానాలు సాధించడం అభ్యాసం చేయాలి.

  ప్రిప‌రేష‌న్ ప్లాన్ ఎలా ఉండాలి..

  టైమ్ టేబుల్‌ని రూపొందించుకోండి: ప‌రీక్ష‌ప్రిప‌రేష‌న్ (Exam Preparation) అయ్యే వారు ముందుగా ఏం చ‌ద‌వాలి. ఎప్పుడు ఏ స‌బ్జెక్ట్‌కు ఎంత స‌మ‌యం కేటాయించాలో క‌చ్చితంగా టైం టేబుల్ ఉండాలి. మీ స‌క్సెస్ ఆ టైం టేబుల్ త‌యారీపై ఆధార ప‌డి ఉంటుంది.

  కాన్సెప్ట్‌లపై దృష్టి: ఎక్కువ విష‌యాలు చ‌ద‌వ‌డం కాకుండా. అవ‌స‌ర‌మైన కాన్సెప్ట్‌ల‌ను నోట్ చేసుకొని వాటిని ప్రిపేర్ అవ్వాలి. రిపీటెడ్ ప్ర‌శ్న‌ల‌ను అభ్య‌సం చేస్తూనే వాటి కాన్సెప్ట్ నేర్చుకోండి. స్కోరింగ్ రిపీటెడ్ కాన్సెప్ట్ చాలా అవ‌స‌రం.

  JNTUH: విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ప‌రీక్ష‌ల‌కు సంబంధించి జేఎన్‌టీయూ కీల‌క నిర్ణ‌యం

  స్వీయ-అంచనా : ఎవ‌రికీ చెప్ప‌కున్నా మీకు మీరు త‌ర‌చూ అంచ‌నా వేసుకోవాలి. ప్ర‌తీ నాలుగు రోజుల‌కు మోడ‌ల్ పేప‌ర్ చేసి. మార్కుల వ్య‌త్యాసం గుర్తించడం. ఏ కాన్సెప్ట్ వీక్ ఉన్నారో అవి ప్రిపేర్ అవ్వాలి. స్వీయ అంచనాకు మించి మాస్టర్ ఎవ్వ‌రూ లేరు.

  మాక్ టెస్ట్‌లు: SSC CHSL ప్రిపరేషన్‌లో మాక్ టెస్ట్‌లు (Mock Test) ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రతీ ప‌రీక్ష‌లో 10 నుంచి 15శాతం రిపీటెడ్ ప్ర‌శ్న‌లు లేదా కాన్సెప్ట్‌లు ఉంటాయి. వీటిని త‌క్కువ క‌ష్టంతోనే నేర్చుకోవ‌చ్చు. ఇవీ మార్కులు పెంచుతాయి. మాక్ టెస్ట్‌లు రాయ‌డం ద్వారా వీటిని సుల‌భంగా సాధించ‌వ‌చ్చు.

  దరఖాస్తు విధానం

  స్టెప్-1: సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inను సందర్శించాలి.

  స్టెప్-2: హోమ్ పేజీలోని ఎస్‌ఎస్‌సీ క్యాండిడేట్స్ పోర్టల్‌లో అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

  స్టెప్-3: ఆ తరువాత ఫేజ్ X 2022 పరీక్ష కోసం లాగిన్ అయి దరఖాస్తు చేసుకోండి.

  స్టెప్-4: అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

  స్టెప్-5: ఆపై దరఖాస్తు రుసుమును చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.

  స్టెప్-6: దరఖాస్తు ఫారమ్ కన్ఫర్‌మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.

  స్టెప్-7:  దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 13, 2022 వరకు అవకాశం ఉంది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Job notification, JOBS, Ssc exams, Staff Selection Commission

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు