హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSC 2022 Exam Calendar: నిరుద్యోగులకు అలర్ట్... ఎస్ఎస్‌సీ ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల

SSC 2022 Exam Calendar: నిరుద్యోగులకు అలర్ట్... ఎస్ఎస్‌సీ ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల

ఎస్ఎస్‌సీ సీహెచ్ఎల్

ఎస్ఎస్‌సీ సీహెచ్ఎల్

SSC 2022 Exam Calendar | టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్. వచ్చే ఏడాది భారీ సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల (Central Government Jobs) భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ రానున్నాయి. ఏ నెలలో ఏ జాబ్ నోటిఫికేషన్ రానుందో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (Central Government Jobs) కోరుకునే నిరుద్యోగులకు అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల చేసింది. 2022 లో రిలీజ్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ల వివరాలు వెల్లడించింది. ఏఏ నెలలో నోటిఫికేషన్ రానుందో, చివరి తేదీ ఎప్పుడో, పరీక్ష ఎప్పుడు ఉంటుందో తెలిపింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్ లాంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. మరి ఏఏ జాబ్ నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయో తెలుసుకోండి.

 పరీక్ష పేరు టైర్ లేదా ఫేజ్ అడ్వర్టైజ్‌మెంట్ తేదీ దరఖాస్తుకు చివరి తేదీపరీక్ష తేదీ
 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, 2021 టైర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) 2021 డిసెంబర్ 23 2022 జనవరి 23 2022 ఏప్రిల్
 కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2021 టైర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) 2022 ఫిబ్రవరి 1 2022 మార్చి 7 2022 మే
 మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్, 2021 టైర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) 2022 మార్చి 22 2022 ఏప్రిల్ 30 2022 జూన్
 సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్, ఫేజ్ 10, 2022 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2022 మే 10 2022 జూన్ 9 2022 జూలై
 రిక్రూట్‌మెంట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, 2022 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2022 మే 17 2022 జూన్ 16 2022 సెప్టెంబర్
 రిక్రూట్‌మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ (డ్రైవర్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, 2022 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2022 జూన్ 27 2022 జూలై 26 2022 అక్టోబర్
 రిక్రూట్‌మెంట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ (AWO/TPO) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, 2022 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2022 జూలై 4 2022 ఆగస్ట్ 3 2022 నవంబర్
 సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్, 2021 పేపర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) 2022 ఆగస్ట్ 14 2022 సెప్టెంబర్ 13 2022 డిసెంబర్
 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్, 2021 పేపర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) 2022 ఆగస్ట్ 22 2022 సెప్టెంబర్ 21 2022 డిసెంబర్
 సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఐఎండీ ఎగ్జామినేషన్, 2022 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2022 ఆగస్ట్ 29 2022 సెప్టెంబర్ 28 2023 జనవరి
 రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఎంటీఎస్ (సివిలియన్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, 2022 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2022 అక్టోబర్ 11 2022 నవంబర్ 15 2023 ఫిబ్రవరి
 జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్) ఎగ్జామినేషన్, 2021 పేపర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) 2022 నవంబర్ 28 2022 డిసెంబర్ 27 2023 మార్చి
 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్, 2021 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2022 డిసెంబర్ 5 2022 డిసెంబర్ 31 2023 ఏప్రిల్
 రిక్రూట్‌మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటీవ్) మేల్, ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, 2022 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2023 జనవరి 9 2023 ఫిబ్రవరి 12 2023 మే
 కానిస్టేబుల్స్ (GD) ఇన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs), ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్‌మ్యాన్ (GD) ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2022 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2023 ఫిబ్రవరి 222023 మార్చి 31 2023 జూన్


ఈ జాబ్ క్యాలెండర్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సూచించిన తేదీల్లోనే జాబ్ నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులను బట్టి నోటిఫికేషన్ తేదీల్లో ఏవైనా మార్పులు ఉండొచ్చు. కాబట్టి అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ఫాలో కావాలి.

First published:

Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS, Staff Selection Commission

ఉత్తమ కథలు