హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్-2023 షెడ్యూల్ విడుదల.. ప్రధాన పరీక్షల తేదీలు ఇవే..

SSC Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్-2023 షెడ్యూల్ విడుదల.. ప్రధాన పరీక్షల తేదీలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సంస్థల్లో పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏటా పరీక్షలను నిర్వహిస్తుంటుంది. వచ్చే ఏడాది నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను కమిషన్ తాజాగా వెల్లడించింది. అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా పరీక్ష తేదీల నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవచ్చు. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సంస్థల్లో పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏటా పరీక్షలను నిర్వహిస్తుంటుంది. వచ్చే ఏడాది నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను కమిషన్ తాజాగా వెల్లడించింది. అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా పరీక్ష తేదీల నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవచ్చు. ఎస్‌ఎస్‌సీ తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(CGL)- 2021 (స్కిల్ టెస్ట్), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ (CHSL)- 2021 (స్కిల్ టెస్ట్), సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్స్ (GD) పోస్టులు, (CAPFS)- NIA- SSF అండ్ రైఫిల్‌మ్యాన్ (GD) ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2022, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'C' & 'D' ఎగ్జామినేషన్- 2022 (స్కిల్ టెస్ట్) వంటి పరీక్షల డేట్ షీట్(షెడ్యూల్) విడుదల చేసింది.

SSC 2023 ఎగ్జామ్ షెడ్యూల్..

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFS), NIA, SSF, రైఫిల్‌మ్యాన్ (GD)లో కానిస్టేబుల్స్ (GD)పోస్టుల భర్తీకి నిర్వహించే అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్- 2022ను SSC వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14 వరకు నిర్వహించనుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'C' & 'D' ఎగ్జామ్‌నేషన్- 2022కు సంబంధించిన స్కిల్ టెస్ట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఉంటుంది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్- 2021 సంబంధించిన స్కిల్ టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 4, 5 తేదీల్లో జరగనుంది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్- 2021కు సంబంధించిన స్కిల్ టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 6న ఉంటుంది.

కొత్త అప్‌డేట్స్ ఇవే..

అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్-2021 రాత పరీక్ష 2021 నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జరిగిన ఈ పరీక్ష ఫలితాలు ఈ ఏడాది మార్చి 25న విడుదలయ్యాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ)కోసం ఆహ్వానించారు.

పీఈటీ, పీఎస్‌టీ ఫలితాలు ఆగస్టు 12న వెలువడ్డాయి. ఇందుల్లో పాసైన వారికి డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్‌‌ను నిర్వహించారు. నవంబర్ 7న, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (RME) ఫలితాలను ప్రకటించారు.

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFS), NIA, SSF, రైఫిల్‌మ్యాన్ (GD)లో కానిస్టేబుల్స్ (GD)పోస్టుల భర్తీకి నిర్వహించిన అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్స్-2021 తుది మార్కులను SSC ఇటీవల ప్రకటించింది. ఈ వివరాలు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో డిసెంబర్ 7వరకు అందుబాటులో ఉంటాయి.

First published:

Tags: Central Government Jobs, JOBS, Ssc, Staff Selection Commission

ఉత్తమ కథలు