Home /News /jobs /

SSC DELHI POLICE CONSTABLE RECRUITMENT APPLICATIONS INVITING FOR 835 POSTS SALARY UP TO RS 81100 HERE DETAILS NS

SSC Delhi Police Constable Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో 835 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్ విద్యార్హత కలిగిన వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. భారీగా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఢిల్లీ పోలీస్ (Delhi Police) విభాగంలో మొత్తం హెడ్ కానిస్టేబుల్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 835 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో పురుషుల విభాగంలో 559, స్త్రీల విభాగంలో 276 ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ssc.nic.in, delhipolice.gov.in వెబ్ సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 16ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన అనంతరం జూన్ 21 నుంచి 25 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నారు.

    ఎగ్జామ్ కు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను త్వరలో విడుదల చేయనున్నారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. అందిన దరఖాస్తుల ఆధారంగా పరీక్ష సెంటర్లను నిర్ణయిస్తారు. అభ్యర్థులు ఢిల్లీ పోలీస్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఎగ్జామ్ అడ్మిషన్ సర్టిఫికేట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
    TS Police Jobs: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. పోలీస్ జాబ్స్‌కు మరో రెండేళ్ల వయో పరిమితి పెంపు.. దరఖాస్తు గడువు కూడా పెంపు?

    వయో పరిమితి: అభ్యర్థులు జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
    విద్యార్హతల వివరాలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి. ఇంగ్లిష్ నిమిషంలో 30 పదాలు, హిందీకి సంబంధించి నిమిషానికి 25 పదాలును టైప్ చేయగలగాలి.


    వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వేతనం చెల్లించాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, JOBS, Police jobs, Staff Selection Commission

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు