Constable Jobs: ఇంటర్ అర్హతతో 5846 కానిస్టేబుల్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

SSC Constable Recruitment 2020 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 1, 2020, 9:11 AM IST
Constable Jobs: ఇంటర్ అర్హతతో 5846 కానిస్టేబుల్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
Constable Jobs: ఇంటర్ అర్హతతో 5846 కానిస్టేబుల్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పోలీస్ ఉద్యోగం మీ కలా? కానిస్టేబుల్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ఢిల్లీ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2020 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 5846 ఖాళీలను ప్రకటించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నుంచి వచ్చిన మరో భారీ జాబ్ నోటిఫికేషన్ ఇది. ఇంటర్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 ఆగస్ట్ 1న అంటే ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 ఉద్యోగాలు... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీలు

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 26,778 ఉద్యోగాలు... వారం రోజుల్లోనే భర్తీ

SSC Constable Recruitment 2020: ఖాళీలు, అర్హతల వివరాలివే


మొత్తం కానిస్టేబుల్ పోస్టులు- 5846
కానిస్టేబుల్ మేల్- 3433
కానిస్టేబుల్ మేల్ ఎక్స్‌సర్వీస్‌మెన్- 226కానిస్టేబుల్ మేల్ ఎక్స్‌సర్వీస్‌మెన్ కమాండో- 243
కానిస్టేబుల్ ఫీమేల్- 1944
విద్యార్హత- 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి.
వయస్సు- 2020 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.

ESI Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 120 జాబ్స్... ఖాళీల వివరాలివే

Jobs: అనంతపురం జిల్లాలో 1851 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SSC Constable Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 1
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 7
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 9
ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 11
ఆఫ్‌లైన్ చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 14 బ్యాంకింగ్ వేళలు ముగిసేవరకు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- 2020 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్- హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
Published by: Santhosh Kumar S
First published: August 1, 2020, 9:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading