Home /News /jobs /

SSC CONSTABLE IN DELHI POLICE 2022 NOTIFICATION RELEASED HERE FULL DETAILS NS

SSC Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 1411 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (SSC Job Notification) విడుదల చేసింది SSC.

    స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (SSC Job Notification) విడుదల చేసింది SSC. మొత్తం 1411 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దిల్లీ పోలీస్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే.. పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..































    కేటగిరీపోస్టుల సంఖ్య
    జనరల్604
    EWS142
    OBC353
    ఎస్సీ262
    ఎస్టీ50
    మొత్తం:1411

    అర్హతల వివరాలు:
    10+2 (సీనియర్ సెకండరీ) విద్యార్హతల కలిగిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాహనాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి యస్సు జులై 1 నాటికి 18-27 ఏళ్ల వయస్సు ఉండాలి.
    Vizag: అగ్రికల్చర్‌ డిప్లొమా తర్వాత భారీగా కెరీర్‌ అవకాశాలు? తర్వాత చదవాలనుకుంటే ఏఏ కోర్సులున్నాయి..!

    ముఖ్యమైన తేదీలు:
    దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: జులై 7
    దరఖాస్తులకు ఆఖరి తేదీ: జులై 29.
    ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ: జులై 30
    కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): అక్టోబర్
    Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే



    ఇతర వివరాలు:
    అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఈ ఎగ్జామ్ కోసం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, గుంటూరు, చీరాల, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, విజయనగరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహిస్తారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, JOBS, Staff Selection Commission

    తదుపరి వార్తలు