SSC Constable GD Recruitment 2021 | పోలీస్ జాబ్ కోరుకునేవారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC భద్రతా దళాల్లో 25,271 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లాంటి భద్రతా దళాల్లో మొత్తం 25,271 ఖాళీలను భర్తీ చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 ఆగస్ట్ 31 లాస్ట్ డేట్. ఆసక్తి గల అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్సైట్లో అప్లై చేయాలి. దీంతో పాటు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్-UMANG యాప్ ద్వారా ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఇదే కాదు... స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC జారీ చేసే అన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం, ఫలితాలు, వన్ టైమ్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ప్రాసెస్ లాంటివన్నీ ఉమాంగ్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. 25,271 కానిస్టేబుల్ పోస్టులకు ఉమాంగ్ యాప్‌లో దరఖాస్తు చేయొచ్చు. అప్లై చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు, ఇతర అర్హతల వివరాలు తెలుసుకోవాలి.
SSC Constable GD Recruitment 2021: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లై చేయండి ఇలా
నోటిఫికేషన్ చదివిన తర్వాత అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం New User? Register Now పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదటి స్టెప్‌లో పేరు, విద్యార్హతలు ఇతర బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి.
రెండో స్టెప్‌లో ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
మూడో స్టెప్‌లో అభ్యర్థి లేటెస్ట్ ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
ఈ మూడు స్టెప్స్ పూర్తి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
ఒకవేళ గతంలోనే ఈ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసినవారు నేరుగా https://ssc.nic.in/ వెబ్సైట్లో లాగిన్ కావాలి.
రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఓసారి వివరాలన్నీ చెక్ చేయాలి.
ఆ వివరాల్లో మార్పులు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Constables (GD) in Central Armed Police Forces (CAPFs), NIA, SSF and Rifleman (GD) in Assam Rifles Examination, 2021 నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.
చివరగా దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
చివరగా అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
SSC Constable GD Recruitment 2021: ఉమాంగ్ యాప్‌లో అప్లై చేయండి ఇలా
ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ కావాలి.
సెర్చ్‌లో Staff Selection Commission అని సెర్చ్ చేయాలి.
ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
ఆ తర్వాత పైన చెప్పిన స్టెప్స్ ప్రకారం దరఖాస్తు చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.