Constable Jobs: మొత్తం 25,271 కానిస్టేబుల్ జాబ్స్... ఏం చదవాలంటే

Constable Jobs: మొత్తం 25,271 కానిస్టేబుల్ జాబ్స్... ఏం చదవాలంటే (ప్రతీకాత్మక చిత్రం)

Constable Jobs | స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC భారీగా కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తుందో తెలుసుకోండి.

  • Share this:
    భద్రతా బలగాల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మొత్తం 25,271 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్-CAPFs లాంటి భద్రతా దళాల్లో ఈ ఖాళీలున్నాయి. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 31 చివరితేదీ. అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమి,న్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో దరఖాస్తు చేయాలి. మరి ఈ ఉద్యోగాలకు పరీక్షా విధానం ఎలా ఉంటుంది? సెలెక్షన్ ప్రాసెస్ ఏంటీ? ఏం చదవాలి? తెలుసుకోవాలి.

    స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మొత్తం 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయనుంది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు ఉంటాయి. ఎన్‌సీసీ విద్యార్థులకు బోనస్ మార్కులు ఉంటాయి. సిలబస్ విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, హిందీ, ఇంగ్లీష్ టాపిక్స్‌తో ఎగ్జామ్ ఉంటుంది.

    UBI Recruitment 2021: యూనియన్ బ్యాంక్‌లో 347 మేనేజర్ జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

    జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో అనలాజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పాటియల్ విజువలైజేషన్, స్పేటియల్ ఓరియెంటేషన్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్ కాన్సెప్ట్స్, ఆర్థమెటికల్ రీజనింగ్, ఫిగరల్ క్లాసిఫికేషన్, ఆర్థమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ లాంటి టాపిక్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్‌లో స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనమిక్ సీన్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్‌స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్ టాపిక్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో నంబర్ సిస్టమ్స్, కంప్యుటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ నెంబర్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ లాంటి టాపిక్స్ ఉంటాయి.

    Army Jobs 2021: డిగ్రీ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్‌లో పురుషులు 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు, 6.5 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి. మహిళలు 8.5 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు, 4 నిమిషాల్లో 800 మీటర్లు పరుగెత్తాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వివరాలు చూస్తే పురుషులు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
    Published by:Santhosh Kumar S
    First published: