హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Constable Jobs: టెన్త్ పాస్ అయినవారికి 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Constable Jobs: టెన్త్ పాస్ అయినవారికి 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Constable Jobs: టెన్త్ పాస్ అయినవారికి 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Constable Jobs: టెన్త్ పాస్ అయినవారికి 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

SSC Constable GD Recruitment 2021 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

కానిస్టేబుల్ ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్-CAPF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF లాంటి సంస్థల్లో కానిస్టేబుల్ పోస్టులున్నాయి. మొత్తం 25,271 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి అర్హతల వివరాలు తెలుసుకోవాలి.

SSC Constable GD Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 25,271

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)- 7545

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)- 8464

సశస్త్ర సీమా బల్ (SSB)- 3806

ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP)- 1431

ఏఆర్- 3785

స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)- 240

Indian Army Jobs: టెన్త్ పాస్ అయిన అమ్మాయిలకు ఆర్మీలో జాబ్స్... త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుందంటే... ఫార్ములా ఇదే

SSC Constable GD Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 17

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 31 రాత్రి 11.30 గంటలు

ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 2 రాత్రి 11.30 గంటలు

ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 4 రాత్రి 11.30 గంటలు

ఆఫ్‌లైన్ చలానా చెల్లించడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 7 బ్యాంకు వేళలు ముగిసేలోగా

అడ్మిట్ కార్డుల విడుదల- తేదీ త్వరలో వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్- తేదీ త్వరలో వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్

Post Office Jobs: టెన్త్, ఇంటర్ పాసైనవారికి పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు... రూ.81,000 వరకు జీతం

SBI Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఎస్‌బీఐలో 6100 జాబ్స్... అప్లై చేయండి ఇలా

SSC Constable GD Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి 10వ తరగతి పాస్ కావాలి.

వయస్సు- 2021 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 23 ఏళ్లు. అంటే 1998 ఆగస్ట్ 2 నుంచి 2003 ఆగస్ట్ 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయొచ్చు.

ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామ్, రివ్యూ మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.

దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Telangana government jobs, Telangana jobs, Tspsc jobs, Upcoming jobs

ఉత్తమ కథలు