స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10 + 2) లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL 2022) నోటిఫికేషన్ రేపు అంటే డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. అభ్యర్థులు అధికారిక సైట్ ssc.nic.inలో దీనికి సంబంధించి వివరాలను చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈ నోటిఫికేషన్‌ను నవంబర్ 5న విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక కారణాల కారణంగా.. దానిని రేపటికి వాయిదా వేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారు అనే వివరాలు రేపు(డిసెంబర్ 06) నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే దాని సమాచారం తెలియనుంది.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. DEO(Date Entry Operator), CAG పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి సైన్స్ స్ట్రీమ్ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా.. విద్యార్థి 12వ తరగతిలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. SSC CHSL ఎగ్జామ్‌కు అప్లికేషన్ ఫీజు రూ. 100. అయితే మహిళలు, SC, ST, శారీరక వికలాంగులు లేదా మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు ఉండదు.
దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్..
సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్‌కు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక ఐటీ ప్రూఫ్‌ను సిద్ధం చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి డెబిట్/క్రెడిట్ కార్డ్ అవసరం. కాస్ట్ కర్టిఫికెట్, 10వ, 12వ తరగతుల మార్క్ షీట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్, అభ్యర్థి సంతకం.. వంటి వాటిని స్కాన్ చేసి పెట్టుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
- అభ్యర్థులు ముందుగా SSC అధికారిక వెబ్సైట్ ssc.nic.inకి వెళ్లండి.
-ఆపై హోమ్ పేజీలో “SSC CHSL ఆన్లైన్లో అప్లై” లింక్‌పై క్లిక్ చేయండి.
-తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్ వర్డ్ లను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
-పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు మరియు ఇతర అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
-చివరగా అప్లికేషన్ సమర్పించిన తర్వాత.. అభ్యర్థి దానిని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్..
CHSL ఎగ్జామ్ రెండు విభాగాలుగా జరుగుతుంది. టైర్-I అనేది డిస్క్రిప్టివ్ పేపర్, స్కిల్ టెస్ట్ లేదా టైప్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్‌లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కులు తీసివేస్తారు. టైర్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు టైర్-2కి అర్హులు. టైర్-II పరీక్ష పెన్ అండ్ పేపర్ మోడ్‌లో ఉంటుంది. ఇది 100 మార్కుల డిస్క్రిప్టివ్ పేపర్. అభ్యర్థులు ఒక గంటలో ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, JOBS, Ssc, SSC results, Staff Selection Commission