Govt Jobs: ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... అప్లికేషన్ స్టెప్స్ ఇవే

SSC CHSL 2020 Application Steps | కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, సంస్థల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 12 చివరి తేదీ. మరి ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: December 13, 2019, 3:42 PM IST
Govt Jobs: ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... అప్లికేషన్ స్టెప్స్ ఇవే
Govt Jobs: ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... అప్లికేషన్ స్టెప్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇంటర్ పాసైనవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కల్పిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ఇటీవల కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ CHSL (10+2) ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫకేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఉద్యోగాలకు దరఖాస్తు చేసే విషయంలో అభ్యర్థులకు కొన్ని సందేహాలున్నాయి. కాంపిటీటీవ్ ఎగ్జామ్ ద్వారా లోయర్ డివిజనల్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, సంస్థల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 12 చివరి తేదీ. మరి ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేయడానికి ముందుగా దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌తో పాటు ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి. తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. మీ దగ్గర ఓటీపీ కోసం మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ తప్పనిసరి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ లేదా కాలేజీ ఐడీ లాంటి ఐడీ ప్రూఫ్స్ ఉండాలి. 10వ తరగతి రోల్‌నెంబర్ ఉండాలి. స్కాన్ చేసిన కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్ చేసిన సంతకం సిద్ధంగా పెట్టుకోవాలి.

SSC CHSL 2020 Registration: దరఖాస్తుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి



ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఓపెన్ చేయండి.
మీ వివరాలతో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి.


లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో అప్లై ట్యాబ్ క్లిక్ చేయండి.
CHSL ట్యాబ్ పైన క్లిక్ చేయండి.Combined Higher Secondary (10+2) Level Examination, 2019 పక్కన Apply పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాతి పేజీలో మీ ఆధార్ నెంబర్, ఐడీ ప్రూఫ్ నెంబర్, మీ పేరు, తండ్రి పేరు, తల్లిపేరు, పుట్టిన తేదీ, 10వ తరగతి రోల్ నెంబర్, జెండర్, ఎడ్యుకేషన్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
ఆ తర్వాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
ఆ తర్వాత ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
దరఖాస్తు పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

RRB NTPC Exam Date: మార్చి 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... సోషల్ మీడియాలో ఫేక్ నోటీస్

DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... టెన్త్ పాసైనవారికి డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు

Job Mela: రేపే హైదరాబాద్‌లో జాబ్ మేళా... రిజిస్ట్రేషన్ చేయండి ఇలా
First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>