2022-2023 ఏడాదికి సంబంధించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL 2022-2023) ఎగ్జామ్కు దరఖాస్తులను ఆహ్వానించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission). ఇటీవల దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అయితే దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అప్లికేషన్ సవరణ తేదీలను కూడా ఎస్ఎస్సీ అక్టోబరు 19, 20 తేదీలకు పెంచింది. అక్టోబరు 20 రాత్రి 11 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులుంటే సవరించుకోవచ్చని తెలిపింది. ఈ ఎడిట్ కు అవకాశం కల్పిచిన తేదీలు కూడా ముగిశాయి. తాజాగా ఈ ఎస్సెస్సీ సీజీఎల్(SSC CGL) కు సంబంధించి టైన్ 1 పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. డిసెంబర్ మొదటి వారంలో నుంచి ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
డిసెంబర్ 01వ తేదీన సీజీఎల్ పరీక్ష ఉన్న అభ్యర్థులకు నేటి నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ ద్వారా ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇలా.. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ పరీక్ష సెంటర్, పరీక్ష తేదీ వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆ సారి ఎస్సెస్సీ సీజీఎల్ ద్వారా మొత్తం 20,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం శాఖలో నియమించనున్నారు.
CGL ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా..
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) ఎగ్జామ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. SSC ఈ ఎగ్జామ్ ద్వారా అకడమిక్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది. పరీక్ష టూ టైర్స్లో ఉంటుంది. టైర్ 1 పరీక్షలో 200 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులూ ఉన్నాయి. ఒక్క నెగెటివ్ సమాధానానికి 0.5 మార్కులు తీసివేస్తారు. ఇక ఈ పరీక్షలో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్, రీడింగ్ కాంప్రహెన్షన్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. టైర్ 2 పరీక్షలో 800 మార్కులు ఉంటాయి.
టైర్ 1 కంటే ఈ ఎగ్జామ్ కఠినంగా ఉంటుంది. వ్యాసాలు, లేఖలతో పాటు అప్లికేషన్ రైటింగ్పైన ప్రశ్నలు ఉంటాయి. టైర్ 2 ఎగ్జామ్లో అర్హత సాధించిన వారికి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. అన్ని దశల్లో టాప్లో నిలిచిన అభ్యర్ధులకు చివరిగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సీజీఎల్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారిని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను బట్టి ఆఫీసర్లుగా నియమిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Ssc, Ssc cgl, Staff Selection Commission