హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSC CGL 2020: ఎస్ఎస్​సీ సీజీఎల్​ టైర్​​1 ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ ఇలా చెక్​ చేసుకోండి

SSC CGL 2020: ఎస్ఎస్​సీ సీజీఎల్​ టైర్​​1 ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ ఇలా చెక్​ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీజీఎల్​ టైర్1 పరీక్ష(SSC CGL 2020)లో సాధించిన మార్కుల ఆధారంగా కేటగిరీ వారీగా స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్ (Staff Selection Commission)​ షార్ట్​లిస్ట్ ప్రకటించింది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ (లిస్ట్​–1), జూనియర్​ స్టాటిస్టికల్ ఆఫీసర్​ (లిస్ట్​–2), ఇతర పోస్టులు (లిస్ట్​–3) వేర్వేరు కటాఫ్​లను నిర్ణయించింది.

ఇంకా చదవండి ...

కంబైన్డ్ గ్రాడ్యుయేట్(సీజీఎల్)–2020 లెవల్ టైర్ 1 పరీక్ష ఫలితాలు (SSC CGL Result 2020 Tier 1 Results) విడుదలయ్యాయి. ఫలితాలను స్టాఫ్​ సెలక్షన్ కమిషన్​ (Staff Selection Commission) వెల్లడించింది. ఈ టైర్ 1 పరీక్షను ఆన్​లైన్​ విధానంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఆగస్టు 13 నుండి 24 మధ్య నిర్వహించారు. సెప్టెంబర్​ 2న టైర్​ 1 పరీక్ష కీని (Exam Key) విడుదల చేశారు. కాగా, పరీక్షకు హాజరైన అభ్యర్థులు www.ssc.nic.in వెబ్​సైట్​ నుంచి మెరిట్ లిస్ట్​ను (Merit List) డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్​ లిస్ట్​లో వారి హాల్​ టికెట్​ నంబర్ ఉంటే క్వాలిఫై అయినట్లే లెక్క. టైర్ 1 పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆ తర్వాత టైర్ 2, టైర్​ 3 పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. కేవలం మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక.. వివరాలివే

సీజీఎల్​ టైర్1 పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా కేటగిరీ వారీగా స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ షార్ట్​లిస్ట్ ప్రకటించింది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ (లిస్ట్​–1), జూనియర్​ స్టాటిస్టికల్ ఆఫీసర్​ (లిస్ట్​–2), ఇతర పోస్టులు (లిస్ట్​–3) వేర్వేరు కటాఫ్​లను నిర్ణయించింది. సీజీఎల్ టైర్1 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టైర్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. దానిలోనూ క్వాలిఫై అయిన వారికి టైర్ 3 డిస్క్రిప్టివ్ పరీక్ష, టైర్ 4 కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్/ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిని క్లియర్​ చేసిన వారి సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

IT Jobs: ఐటీ రంగంలో కొలువుల జాతర.. వచ్చే ఏడాది భారత్‌లో 4.5 లక్షల ఉద్యోగాలు.. వివరాలివే

ఎస్​ఎస్​సీ సీజీఎల్ టైర్​1 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:

Step 1: ముందుగా ఎస్​ఎస్​సీ అధికారిక వెబ్‌సైట్-www.ssc.nic.inలోకి లాగిన్​ అవ్వండి.

Step 2: హోమ్​ పేజీపై కనిపించే రిజల్ట్​ ట్యాబ్​ను క్లిక్​ చేయండి.

Step 3: మీకు "కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (టైర్-I), 2020 రిజల్ట్​" అనే నోటిఫికేషన్‌ కనిపిస్తుంది.

Step 4:  వెంటనే ఎస్​ఎస్​సీ రిజల్ట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

CSAB JEE Registration: CSAB- జేఈఈ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ ముహూర్తం ఖరారు.. ఎలా నమోదు చేసుకోవాలంటే..


Step 5:  లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 పేరుతో రిజల్ట్స్​కు సంబంధించిన మూడు.పీడీఎఫ్​లు కనిపిస్తాయి.

Step 6:  వాటిని డౌన్​లోడ్​ చేసుకొని మీ పేరు, అడ్మిట్​ కార్డ్​ నంబర్​ ఉందో లేదో చెక్​ చేసుకోండి.

Step 7:  లిస్ట్​లో మీ పేరు, అడ్మిట్​ కార్డు నంబర్​ ఉంటే టైర్​1లో క్వాలిఫై అయినట్లే.

Step 8:  భవిష్యత్తు అవసరాల కోసం పీడీఎఫ్​ కాపీని మీ వద్దే ఉంచుకోవాలి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

Published by:Nikhil Kumar S
First published:

Tags: Central Government Jobs, Job notification, JOBS, Ssc, Staff Selection Commission

ఉత్తమ కథలు