హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Govt Jobs 2022: డిగ్రీ అర్హతతో 20,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు

Govt Jobs 2022: డిగ్రీ అర్హతతో 20,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు

Govt Jobs 2022: డిగ్రీ అర్హతతో 20,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు
(ప్రతీకాత్మక చిత్రం)

Govt Jobs 2022: డిగ్రీ అర్హతతో 20,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

SSC CGL Recruitment 2022 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో 20,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) భర్తీ కాబోతున్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు కూడా పెరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (Central Govt Jobs) కోరుకునేవారికి అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) ఎగ్జామ్ 2022 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా 20,000 పైగా పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇవన్నీ డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులే. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ పోస్టులకు అక్టోబర్ 8న దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ముందే ప్రకటించింది. అయితే అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో దరఖాస్తు గడువును పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 అక్టోబర్ 13 లోగా దరఖాస్తు చేయొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, పొడిగించిన తేదీలు, విద్యార్హతల గురించి తెలుసుకోండి.

SSC CGL Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

దరఖాస్తుకు చివరి తేదీ2022 అక్టోబర్ 13 రాత్రి 11 గంటలు
ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ2022 అక్టోబర్ 13 రాత్రి 11 గంటలు
ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్‌కు చివరి తేదీ2022 అక్టోబర్ 14 రాత్రి 11 గంటలు
చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ2022 అక్టోబర్ 15 బ్యాంక్ వేళలు ముగిసే వరకు
దరఖాస్తు ఫామ్ కరెక్షన్ చేయడానికి చివరి తేదీ2022 అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 20 రాత్రి 11 గంటలు
కంప్యూటర్ బేస్డ్ టియర్ 1 ఎగ్జామినేషన్2022 డిసెంబర్
కంప్యూటర్ బేస్డ్ టియర్ 2 ఎగ్జామినేషన్త్వరలో వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్

IRCTC Recruitment 2022: పరీక్ష లేకుండా ఐఆర్‌సీటీసీలో 80 ఉద్యోగాలు ... ఆ అర్హతలు ఉంటే చాలు

SSC CGL Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

మొత్తం ఖాళీలు- సుమారు 20,000

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. కొన్ని పోస్టులకు ఇతర అర్హతలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

వయస్సు- వేర్వేరు పోస్టులకు వయస్సు వేర్వేరుగా ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.100

వేతనం- రూ.1,51,100 వరకు

జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

IOCL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ ఆయిల్ లో ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో 1535 జాబ్స్.. పూర్తి వివరాలివే..

SSC CGL Notification 2022: అప్లై చేయండి ఇలా

Step 1- అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- ఆ తర్వాత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం New User? Register Now పైన క్లిక్ చేయాలి.

Step 3- మీ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు లాంటి బేసిక్ డీటెయిల్స్‌తో మొదటి ఫామ్ పూర్తి చేయాలి.

Step 4- తర్వాతి స్టెప్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.

Step 5- మూడో స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 6- ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.

Step 7- ఇక ముందే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా లాగిన్ కావొచ్చు.

Step 8- రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీరు అప్పటికే పూర్తి చేసిన వివరాలు కనిపిస్తాయి.

Step 9- ఆ వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు.

Step 10- ఆ తర్వాత కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL నోటిఫికేషన్‌కు అప్లై చేయాలి.

ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగలకు అలర్ట్.. ఆ 10 వేల ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్.. ఎందుకంటే?

ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 20,000 పోస్టుల్ని భర్తీ చేస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in వెబ్‌సైట్‌లో Candidate’s Corner సెక్షన్‌లో Tentative Vacancy సెక్షన్‌లో అప్‌డేట్ చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ మాత్రమే ఫాలో కావాలి.

First published:

Tags: Central Government Jobs, Central Govt Jobs, Govt Jobs 2022, JOBS, Staff Selection Commission

ఉత్తమ కథలు