SSC Jobs: డిగ్రీ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... పరీక్ష సిలబస్ ఇదే

SSC CGL Examination 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 25 లాస్ట్ డేట్. అయితే ఈ ఉద్యోగాలకు పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ, సిలబస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.

news18-telugu
Updated: November 14, 2019, 3:08 PM IST
SSC Jobs: డిగ్రీ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... పరీక్ష సిలబస్ ఇదే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL ఎగ్జామినేషన్ 2019 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పాసైనవారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందొచ్చు. పలు విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ట్యాక్స్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అకౌంటెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ లాంటి గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 25 లాస్ట్ డేట్. అయితే ఈ ఉద్యోగాలకు పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ, సిలబస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.

SSC CGL Examination 2019: పరీక్ష విధానంస్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL ఎగ్జామినేషన్ 2019 నాలుగు అంచెలుగా జరుగుతుంది. మొదటి, రెండో దశలు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మూడో దశ డిస్క్రిప్టీవ్ పేపర్ ఉంటుంది. నాలుగో దశ కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ / డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఉన్న వివరాలివి. ఇప్పుడు అప్లై చేసినవారు మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-25, జనరల్ అవేర్‌నెస్-25, క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్-25, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్-25 ప్రశ్నలుంటాయి. 60 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాలి.

SSC CGL Examination 2019: సిలబస్ ఇదే


General Intelligence & Reasoning: ఇందులో వర్బల్, నాన్-వర్బల్ ప్రశ్నలుంటాయి. అనలాజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, స్పాటియల్ ఓరియెంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలసిస్, జడ్జ్‌మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరి, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్‌‌షిప్ కాన్సెప్ట్స్, ఆర్థమెటికల్ రీజనింగ్ అండి ఫిగరల్ క్లాసిఫికేషన్, ఆర్థమెటిక్ నెంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్డ్ బిల్డింగ్, ఇండెక్సింగ్, అడ్రస్ మ్యాచింగ్, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ లాంటి ప్రశ్నలుంటాయి.

General Awareness: భారతదేశంతో పాటు పొరుగు దేశాల చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, కరెంట్ అఫైర్స్, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి.

Quantitative Aptitude: నంబర్స్, డెసిమల్స్, పర్సెంటేజ్, రేషియో ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైమ్ అండ్ వర్క్, సర్కిల్, ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్స్, రెగ్యులర్ పాలిజన్స్, సర్కిల్, రైట్ ప్రిజమ్, హైట్ అండ్ డిస్టెన్సెస్ లాంటి అంశాలు ఉంటాయి.English Comprehension: అభ్యర్థులు ఇంగ్లీష్ సరిగ్గా అర్థం చేసుకోవాలి. రాయగలగాలి.

సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ఎలా ఉన్నాయో చూడండిఇవి కూడా చదవండి:

Jobs: విశాఖలోని నావల్ డాక్‌యార్డ్‌లో 275 జాబ్స్... పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి

Jobs: ఇంటర్ పాసైన అమ్మాయిలకు గుడ్ న్యూస్... ఇండియన్ ఆర్మీలో చేరే అవకాశం

Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 4103 జాబ్స్... దరఖాస్తు చేయండి ఇలా
First published: November 14, 2019, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading