హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Language War: SSC CGL ఎగ్జామ్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి.. కన్నడ భాషా సంఘాల ఆందోళన..

Language War: SSC CGL ఎగ్జామ్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి.. కన్నడ భాషా సంఘాల ఆందోళన..

Language War: SSC CGL ఎగ్జామ్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి.. కన్నడ భాషా సంఘాల ఆందోళన

Language War: SSC CGL ఎగ్జామ్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి.. కన్నడ భాషా సంఘాల ఆందోళన

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ ఎగ్జామ్‌ను ప్రాంతీయ భాషల్లో రాసే ఆప్షన్ లేకపోవడంతో  కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని అక్కడి భాషాభివృద్ధి సంఘాలు ఆందోళన బాట పట్టాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

జాతీయ స్థాయిలో జరిగే అన్ని పరీక్షలు ప్రాంతీయ భాషల్లో(Regional Language) కూడా నిర్వహించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇందు కోసం దక్షణాది రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా తమిళనాడులో(Tamilanadu) పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీని గురించి తమిళనాడు ప్రభుత్వం(Tamilanadu Government) ఏకంగా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. ఈసారి కర్ణాటక అందుకు వేదికైంది. కన్నడ భాష అభివృద్ధికి అక్కడి బొమ్మై సర్కార్ ఇటీవల ‘సమగ్ర కన్నడ అభివృద్ధి’ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని రోజులకే, భాష యుద్ధం చోటుచేసుకోవడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్‌మెంట్స్‌లోని క్లరికల్ పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అర్హత పరీక్షలు నిర్వహిస్తుంటుంది. ఇటీవల కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పరీక్ష కేవలం ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్‌ల్లో మాత్రమే నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాంతీయ భాషలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని అక్కడి భాషాభివృద్ధి సంఘాలు ఆందోళన బాట పట్టాయి.

Top 10 Skills To Get Job: ఉద్యోగ సాధనలో ఉపయోగపడే టాప్ 10 నైపుణ్యాలు ఇవే.. నివేదిక విడుదల చేసిన లింక్డ్‌ఇన్ ..

20వేల పోస్టుల భర్తీ

SSC CGL పరీక్షల షెడ్యూల్ గత వారం విడుదలైంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ రాజ్యాంగ సంస్థలు, ట్రిబ్యునల్స్‌లోని గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేయడానికి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా దాదాపు 20,000 పోస్టుల భర్తీ చేయనున్నారు. అయితే కేవలం ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే జరగనుంది.

మాతృభాషలోనే చదివిన వారికి తీవ్ర నష్టం

కన్నడ అనుకూల ఉద్యమకారుడు అరుణ్ జవగల్ మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష గతంలో జోనల్ స్థాయిలో జరిగేదన్నారు. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. మరోపక్క మాతృభాషలోనే చదివిన విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారని, పరీక్షను కేవలం ఇంగ్లిష్, హిందీలో నిర్వహిస్తే వారు తీవ్రంగా నష్టపోతారని అరుణ్ అన్నారు.

 గతంలో ఆందోనలు

జాతీయ స్థాయి పరీక్షలను భారతీయ ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని 2021లో దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. దీంతో అదే సంవత్సరం అక్టోబర్‌లో కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచన చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) కోసం IBPS క్లరికల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది.

Bank Jobs 2022: IDBI, SBI, NABARD పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి.. ఆ వివరాలిలా.. 

ప్రాంతీయ భాషలను నిర్లక్ష్యం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందే పౌరులకు ఇబ్బందులు ఎదురవుతాయని కన్నడ సంఘాలు వాదిస్తున్నాయి. దీంతో జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ కింద అన్ని పరీక్షలను కన్నడతో సహా ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ డిమాండ్ చేస్తోంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Cgl, JOBS, Ssc cgl

ఉత్తమ కథలు