SSC CGL ANSWER KEY RELEASED KNOW HOW TO RAISE OBJECTIONS EVK
SSC CGL Answer Key Released: ఎస్ఎస్సీ సీజీఎల్ కీ విడుదల.. అభ్యంతరాలు ఉంటే ఏం చేయాలో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) ఇటీవల నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL) పరీక్షకు సంబంధించిన కీ విడుదల చేసింది. కీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ssc.nic.in వెబ్సైట్లో ఉంచారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) ఇటీవల నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షకు సంబంధించిన కీ విడుదల చేసింది. కీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ssc.nic.in వెబ్సైట్లో ఉంచారు. పరీక్ష రాసిన అభ్యర్థులు పరీక్ష కీ సరి చూసుకోవచ్చు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో వివిధ పోస్టులకు ఆగస్టు 13, 2021 నుంచి 24, 2021 వరకు పరీక్షలు జరిగాయి.
అంతే కాకుండా కీ కు సంబంధించి ఏమైన అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు వాటని వైబ్సైట్లో కమిషన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఇచ్చారు. ఈ అభ్యంతరాలు తెలపడానికి సెప్టెంబర్ 7,2021 వరకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) అవకాశం ఇచ్చింది.
అభ్యర్థులు తాము రాసిన రెస్పాన్షీట్నుపొందవచ్చు. అయితే ఏమైన అభ్యంతరాలు ఉంటే మాత్రం నగదు చెల్లించి వాటిని కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలి. అభ్యంతరాలు(Objections) తెలపడానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్ఎస్సీ కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..
Step 1: అధికారిక వెబ్సైట్, ssc.nic.in ని సందర్శించండి
Step 2: అక్కడ జవాబు కీ లింక్‌పై క్లిక్ చేయండి, ఒక పీడిఎఫ్(PDF) వస్తుంది.
Step 3: పీడీఎఫ్‌లోని ఓ లింక్‌పై క్లిక్ చేయండి
Step 4: మీకు సంబంధించిన వివరాలు అందించాలి. మీ జవాబు పత్రం(Answer Sheet) మీకు కనబడుతుంది.
Step 5: మీరు ఏమైన అభ్యంతరం చెప్పాలనుకుంటున్న జవాబు కీని ఎంచుకోండి
Step 6: అవసరమైన, అడిగిన డాక్యుమెంట్(Documents)లను అప్లోడ్ చేయండి
Step 7: ఫీజు చెల్లించి సబ్మిట్ కొట్టండి.
మీరు సమాధాన పత్రంలో ఏమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దానికి సంబంధించిన పూర్తి విషయాన్ని కమిషన్ అధ్యయనం చేస్తుంది. అందులో సరైందని భావిస్తే మీ అభ్యంతరాన్ని ఒప్పుకొని కొత్త కీని విడుదల చేస్తుంది. అభ్యంతరాలు తెలపడానికి మాత్రం కచ్చితంగా రూ.100 ఫీజు చెల్లించాల్సిందే. మీరు తెలిపిన అభ్యంతరాలు సరైనవే అయితే వాటిని మార్చి తుది కీ విడుదల చేస్తారు. ఆ తుది కీ(Final key) ఆధారంగానే పరీక్ష ఫలితాలు విడుదల చేస్తారు. కీ చూసుకొనేందుకు క్లిక్ చేయండి..
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.