స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(CGL) పరీక్షకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ (Exam) ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ని గ్రూప్-బీ, గ్రూప్-సీ విభాగంలోని ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నాను. ఇందుకు సంబంధించిన టైర్ - 1 ఎగ్జామ్ ఏప్రిల్ 2020లో నిర్వహించనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 36 విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
1. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
2. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
3. అసిస్టెంట్ సెక్షన్ ఆఫసీర్
4. అసిస్టెంట్
5. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్ కమ్ ట్యాక్స్
6. ఇన్స్పెక్టర్(CGST&Central Excise)
7. ఇన్స్పెక్టర్(ప్రెవెంటీవ్ ఆఫీసర్)
8. ఇన్స్పెక్టర్(ఎగ్జామినర్)
9. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్
10. సబ్ ఇన్స్పెక్టర్
11. ఇన్స్పెక్టర్ పోస్టులు
12. అసిస్టెంట్/సూపరింటెండ్
13. రీసెర్చ్ అసిస్టెంట్
14. డివిజనల్ అకౌంటెంట్
15. సబ్ ఇన్స్పెక్టర్
16. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్(JSO)
17. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2
18. ఆడిటర్
19. అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్
20. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్స్
21. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
22. ట్యాక్స్ అసిస్టెంట్
23. సబ్ ఇన్స్పెక్టర్
అర్హతల వివరాలు: పై 23 విభాగాల్లోని ఉద్యోగాలకు విద్యార్హతలను వేర్వేరుగా నిర్ణయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
-అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. దీంతో పాటు చార్టెడ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటెన్స్ లేదా కంపెనీ సెక్రటరీ/ఎంకాం/ఎంబీఏ(ఫైనాన్స్)/బిజినస్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసి ఉండాలి.
-జూనియర్ స్టాటిస్టికల్ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. ఇంటర్ స్థాయిలో మాథ్స్ సబ్జెక్టుగా ఉండాలి. ఇతర ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 ఏళ్లు ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
-దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 23, 2021.
-దరఖాస్తులకు ఆఖరీ తేదీలు: జనవర్ 23, 2022.
-ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ: జనవరి 25, 2022.
-ఆఫ్ లైన్ చలానా జనరేట్ చేయడానికి ఆఖరీ తేదీ: జనవరి 26, 2022.
-అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ అయ్యే తేదీ: 28 జనవరి, 2022.
-కంప్యూటర్ డేస్డ్ ఎగ్జామ్ (టైర్-1): ఏప్రిల్ 2022
-ఇతర ఎగ్జామ్ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
అప్లికేషన్:
-అభ్యర్థులు https://ssc.nic.in/ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
-దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు రూ.100ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
-ఎస్సీ, ఎస్టీ, Pwd అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు BHIM UPI, Net Banking, Credit, Debit Card ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Job notification, Ssc, Staff Selection Commission