Head Constable Jobs: హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... ఇంటర్ పాస్ అయితే చాలు

Head Constable Jobs: హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... ఇంటర్ పాస్ అయితే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

SSB Head Constable Recruitment 2021 | పోలీస్ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. సశస్త్ర సీమా బల్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    భద్రతా బలగాల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్-SSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 115 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 22 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సశస్త్ర సీమా బల్-SSB అధికారిక వెబ్‌సైట్ http://www.ssbrectt.gov.in/ తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

    UPSC Recruitment 2021: కేంద్ర హోమ్ శాఖలో ఉద్యోగాలు... రూ.1,50,000 వరకు జీతం

    Metro Jobs: చెన్నై మెట్రోలో ఉద్యోగాలు... రూ.80,000 నుంచి వేతనం

    SSB Head Constable Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 24
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 22
    భర్తీ చేసే పోస్టులు- హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)
    మొత్తం ఖాళీలు- 115
    విద్యార్హతలు- గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 10+2 పాస్ కావాలి.
    ఇతర అర్హతలు- నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా 30 హిందీ పదాలు టైప్ చేయాలి.
    వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు.
    వేతనం- ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 4 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.25,500 బేసిక్ వేతనంతో రూ.81,100 వేతనం వస్తుంది.
    ఎంపిక విధానం- ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, స్కిల్ లేదా టైపింగ్ టెస్ట్

    Constable Jobs: టెన్త్ పాసయ్యారా? 25,271 కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయండి ఇలా

    Army Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు... రూ.1,77,500 వరకు జీతం

    SSB Head Constable Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా http://www.ssbrectt.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో CLICK HERE TO APPLY ONLINE FOR THE POST OF HEAD CONSTABLE (MINISTERIAL)IN SSB లింక్ పైన క్లిక్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Apply పైన క్లిక్ చేయాలి.
    అభ్యర్థులు Register పైన క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి.
    ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
    పార్ట్ 1 లో అభ్యర్థి వివరాలు ఎంటర్ చేయాలి.
    పార్ట్ 2 లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
    పార్ట్ 3 లో దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: