హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SSB Jobs: పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.69,100 వరకు జీతం..!

SSB Jobs: పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.69,100 వరకు జీతం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SSB Jobs: పదో తరగతి అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశం కల్పించింది కేంద్ర హోంశాఖ పరిధిలోని ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్స్ సశస్త్ర సీమా బల్ (Sashastra Seema Bal- SSB). కేంద్ర సాయుధ దళాల్లో ఇది ఒకటి. ఈ దళం నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో గస్తీ కాస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పదో తరగతి అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగం (Goverment Job) పొందే అవకాశం కల్పించింది కేంద్ర హోంశాఖ పరిధిలోని ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్స్ సశస్త్ర సీమా బల్ (Sashastra Seema Bal- SSB). కేంద్ర సాయుధ దళాల్లో ఇది ఒకటి. ఈ దళం నేపాల్ (Nepal), భూటాన్ (Bhutan) సరిహద్దుల్లో గస్తీ కాస్తుంది. పదో తరగతి అర్హతతో స్పోర్ట్స్ కోటా కింద ఈ విభాగం ఇటీవల కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssbrectt.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రచురణ అయిన రోజు నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

* అర్హత ప్రమాణాలు

కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థుల క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అవ్వాలి. లేకపోతే వారి దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది.

* ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులను ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET), పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్/స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

* అప్లికేషన్ ప్రాసెస్

అభ్యర్థులు అప్లై చేయడానికి ముందు కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కు సంబంధించిన అన్ని అర్హత ప్రమణాలను తప్పనిసరిగా చెక్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ , మార్క్‌షీట్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్, రిజర్వేషన్ సర్టిఫికేట్ (వర్తిస్తే) వంటి డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ముందు ఎస్‌ఎస్‌బీ అధికారిక వెబ్‌సైట్ ssbrectt.gov.in ఓపెన్ చేయాలి.

ఇది కూడా చదవండి : ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో సీడ్యాక్‌లో ఉద్యోగాలు..

హోమ్ పేజీలో SSB కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి, SSB కానిస్టేబుల్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌‌ను నింపండి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి. దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా పంపాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

* జీతం ఎంత ఉంటుంది?

కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య జీతం లభిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా స్పోర్ట్స్ కోటా కింద 399 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే, SSB అవసరాలకు అనుగుణంగా ఖాళీలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Govt Jobs, JOBS, Latest jobs, Ssb

ఉత్తమ కథలు