హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SRIRAM’s Institute: ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్.. శ్రీరామ్స్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్ కీలక నిర్ణయం..

SRIRAM’s Institute: ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్.. శ్రీరామ్స్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్ కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SRIRAM’s Institute: స్కాలర్‌షిప్ సదుపాయంతో పాటు, కోచింగ్ ఖర్చును భరించలేని యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ఈఎంఐ ఆప్షన్‌ను కూడా సంస్థ ప్రారంభించింది. అభ్యర్థులు విడతల వారీగా ఫీజు చెల్లించే సౌకర్యాన్ని కల్పించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈడబ్ల్యూఎస్(EWS) కేటగిరీ విద్యార్థులకు స్పెషల్ స్కాలర్‌షిప్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది ప్రముఖ సివిల్స్ కోచింగ్ సెంటర్ శ్రీరామ్స్ ఇన్‌స్టిట్యూట్ (SRIRAM’s Institute). ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఈ సంస్థ కోచింగ్ ఫీజులు 10 శాతం వరకు స్కాలర్‌షిప్ (Scholarship) డిస్కాంట్ అందించనుంది. అలాగే శారీరక వైకల్యం, కుటుంబాన్ని పోషించే వ్యక్తిని కోల్పోయిన విద్యార్థుల విషయంలో, ఫ్యాక్ట్ చెకింగ్ తర్వాత అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటామని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. కొత్త సివిల్స్ బ్యాచ్‌ను సెప్టెంబర్ 5, 19 తేదీల్లో ప్రారంభించనునట్లు తెలిపింది.స్కాలర్‌షిప్ సదుపాయంతో పాటు, కోచింగ్ ఖర్చును భరించలేని యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ఈఎంఐ ఆప్షన్‌ను కూడా సంస్థ ప్రారంభించింది. అభ్యర్థులు విడతల వారీగా ఫీజు చెల్లించే సౌకర్యాన్ని కల్పించింది. ఈఎంఐ అవకాశం 18 నెలల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ ఈ ఏడాది నుంచి స్కాలర్‌షిప్‌ను ప్రారంభించనుంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ (EWS), దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్ డిస్కౌంట్స్ ఏడాది పొడవునా చెల్లుబాటులో ఉంటాయని ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది.
శ్రీరామ్స్ ఐఏఎస్ సంస్థ వ్యవస్థాపకులు & డైరెక్టర్ శ్రీరామ్ శ్రీరంగం మాట్లాడుతూ, ‘‘ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అర్హులైన విద్యార్థులు ఎటువంటి ఆర్థిక భారం లేదా అస్థిరత లేకుండా పూర్తి సామర్థ్యంతో వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. స్కాలర్‌షిప్‌ను ప్రకటించడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు మా కోచింగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్స్‌లో చేరడానికి ఆసక్తి చూపుతారని ఆశిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.


సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ సంస్థ కోచింగ్ ఇస్తుంది. సివిల్స్ కోచింగ్‌లో ఈ సంస్థకు దాదాపు 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఇక్కడ కోచింగ్ తీసుకున్న ఎంతో మంది అభ్యర్థులు ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ పదవుల్లో కొనసాగుతున్నారు. శ్రీరామ్ కోచింగ్ సెంటర్‌లో 2023 కోసం సివిల్ సర్వీస్ కోచింగ్ ఫ్రెష్ బ్యాచ్ సెప్టెంబర్ 5, 19 తేదీల్లో ప్రారంభం కానుంది. ఇందులో జనరల్ స్టడీస్ కాంప్రహెన్సివ్, జనరల్ స్టడీస్ మాడ్యూల్, ఆప్షనల్ సబ్జెక్టు వంటి కోర్సులు ఉంటాయి.
ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్‌న్యూస్.. భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి..
మరోవైపు ఐఐటీ మద్రాస్, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ (NPTEL)... గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) కోసం అభ్యర్థులకు ఉచిత శిక్షణను అందించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాయి. అలాగే మహారాష్ట్రలోని వైద్యులు- మెడికల్ స్టూడెంట్స్‌కు చెందిన ఓ టీమ్ పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నీట్ కోసం ఉచిత కోచింగ్‌ను అందిస్తోంది. ఈమేరకు 2015లో లిఫ్ట్ ఫర్ అప్‌లిఫ్ట్‌మెంట్ (LFU) అనే సంస్థను స్థాపించారు. ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం చేపట్టే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Scholarship

ఉత్తమ కథలు